Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/566

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తే. తే. తే. మొదట మృగమును, పిదపఁ గార్ముకము నతఁడు క్రిందఁ బడవైచి శిథిల శరీరమునను గూరుచుండె-ఆయుధమును, కొమ్ము, నారి, బాణ ముండెను జిందరవందరగను. “రాగమయి సంధ్య పొందె నల్లందనమ్ము- ఇంటి కా వేటకాఁడు రాఁ డిప్పటికిని చపలజంతువు మోసమ్ముసలిపి యతనిఁ దీసికొని పోయెనా దూరదేశమునకు?" ఇటులఁ దనలోనఁ దానె యోజించుచుండె కదురు పాడుచున్నది హస్తకంజములను- అయ్యె నన్యమనస్క యా యతివ, శ్రద్ధ గుల్ఫములఁ గేశములు ముద్దుగొనుచునుండె. తే. పరగె: నవకేతకీగర్భ పాండుముఖము నేత్రపాళి నలసమైన స్నేహగుణము, నవ్య లజ్జాయుత కృశత ననుచు నట్టి కంపిత లతోపమ మ్మైన క్రమ వపువు. తే. పరమ మాతృత్వభరమున వంగియున్న- పీన వక్షోజయుగళి సంప్రీతి దనరఁ గట్టఁబడె నీలరోమ వల్కలము తోడ - - తే. తరుణి కది యొప్పె నొక యలంకరణ మటుల. కనక సికతను గాళింది గమనరుచుల నించు నిట్టూర్పులతోఁ బ్రవహించు పగిది, అమరవాహిని పైన నీలాబ్జపంక్తి యమరి హసియించు వడుపున నద్ది తోఁచె - తే. బరువులేని నల్లని నేతవసన మొకటి యట్టిదే కటిపయి నామె చుట్టుకొనియె గర్భ మధురవేదన యుండె దుర్భరమయి ఉవిద జననీ ప్రసన్నత నోర్చుచుండె. 15 566 వావిలాల సోమయాజులు సాహిత్యం-1