తే. తే. ఇతరులు సుఖింపఁ జూచి సుఖింపుమయ్య! మనుమహాశయ! సుఖముగ మనుము నీవు విస్తృత మొనర్చి నీ సౌఖ్యవిభవ, మెల్ల వారిని సుఖులఁ గావింపఁ గోరుమయ్య! అగు నిది రచనామూలక మ్మయిన సృష్టి యజ్ఞ - మా యజ్ఞ పురుషున కర్ణి మనము చేయవలసిన సంస్కృతిసేవ నెల్ల నెంతయును విస్తృతమ్మును గావింపవలయు. తే. సీమిత మొనర్చుకొని సౌఖ్యసిద్ధి నెల్ల నీ వఱకె కేవలము దుఃఖనిచయ మీవు విడిచెదవు - పరప్రజలదౌ పీడఁ జూచి పట్టనటు త్రిప్పుకొనెదవు వదనమీవు. తే. కూణిత విముగ్ద మోహన కుట్మలములు దళములను బందిసేసినఁ దావి నెల్ల వికసనము నొంది మకరందబిందువులను మంజు సరసతఁ గనకున్న మరణమొందు. తే. వత్తలగు, రాలిపోవును - పాదదళిత మైన పరిమళమే యపుడబ్బు నీకు! అయినఁ బొందెద వెటనుండి యపుడు స్నిగ్ధ మధుమయామోదమును నీవు మనసుపడుచు. తే. తోఁచుసుఖ మెల్ల మనదు సంతోషమునకె సంగ్రహింపఁదగినది కాఁజాలదెపుడు తమిని నన్యులె దర్శింపఁ దగినయట్టి యొక్క దర్శనగ్రథితమై యున్నదందు. తే. నిర్జనమ్మున నొంటిగ నీవు మనఁగ నే ప్రమోదము వలచి లభింపఁగలదు అన్యహృదయసుమ మ్మెదియైన దీని వలన వికసనావాప్తిని బడయఁబోదు. ఆంధ్ర కామాయని 110 115 561
పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/561
స్వరూపం