Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/560

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తే. నట్టి మనదు సౌఖ్యమును “కా దమరభూమి” యనుచు నీవేల యీగతి ననియెదబల! ఈ తుహిననగాంచలమున నేను దేని వెదకుచున్నానో తిరుగుచు, నదె యభావ మిపుడు స్వర్గమై యొప్పి హసించుచుండె చెలఁగి చంచలమ్మైన యీ జీవనమున. తే. సతము వర్తమానమ్ము జీవితఁపు సుఖము తే. నొలసి యెచట రాగమున సంయోగమందు నెనసి కపటి యైనట్టి యదృష్ట మచటం బ్రకటితం బగునేల? యభావ మగుచు. మన సమస్త కృతులకును మనమె సీమ లము - మనదు నభిలాష తీరంగవలయు కాకయున్నను పడినట్టి కష్టమెల్ల వ్యర్థమై చనుగద యెట్టి ఫలము లేక? 105

  • 4*4*4

తే. శ్రద్ధ విడని మాంద్యముననె సవినయముగ నిటులు వచియించె నంతట "ఈ వివేక మొలసి శేషించి యీరీతి నుంట నెఱిఁగి కన్నుదోయిని దెరువఁగాఁ గడఁగె సృష్టి. తే. పీన మమతా విచక్షణాజ్ఞాన మిద్ది యిటులు మిగులునం చెంచియో యేమొ ప్రళయ జలధి నిజ దారుణోర్మికా నిచయమునకుఁ బరగఁ బొందించియుండు నావర్తనమ్ము. తే. సర్వమునకుఁ దాఁ గేంద్రమై సవదరింప వ్యక్తి యెటుల వికాసమ్ము వడయఁగలఁడు? ఇట్టి యేకైక మౌ స్వార్థ మెంత భీష ణమ్ము- మనలనియ్యది వినాశమ్మొనర్చు. 560 వావిలాల సోమయాజులు సాహిత్యం-1