Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/559

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తే. ఎదియొ దేవతకొరకు రచింపఁబడును మరల నెదియు, దేని బలియె మాయ మోస మిది" - "మనము దానిచే నొందునది సకలము మన సుఖము కల్గ దెది మించి మన సుఖమ్ము. తే. అచల మీ జగాన మిగిలి నట్టి ప్రాణు లవ్వి- అట్టివాని కిచట నరయలేనె యెట్టి యధికారములు అవి యెల్ల నయయొ, సత్వహీనమ్ములా యేమి జగము నందు? తే. భాసు రోదార భవదీయ బహు నవీన మానవత్వ మ్మిదేన? ఓ మనువరేణ్య! ఇందు సకలమ్ము కైకొనుటే నటయ్య! శవత మాత్రమె మిగులునా స్వామి! యిందు?”

తే. "ఎన్నఁడును కాదు తుచ్ఛమో ఇంతి శ్రద్ధ! మన సుఖమ్మేని- అద్దియుఁ గనఁగ నొకటి ఒకటొ రెండొ దినాలుగా నుండు నిట్టి బ్రతుకునం దది యంత్య సర్వస్వమగును. తే. అరయ నే కడ నా యింద్రియాభిలషణ వడయునో సతతమును నా ఫల్యగరిమ ఓ విలాసిని! ఏ యెడ నొనర హృదయ తృప్తి మధురమ్ముగా నాలపించి మించి... తే. ఎచట మృదుల హాసము వికసించి నంత నొదవు రోమహర్ష మది యా జ్యోత్స్నయందు - ఆశలకు నై యెచట నొందు శ్వాసపాళి చెలఁగి యర్పించుకొనుచు నాశ్లేషతృప్తి - తే. దేని సముఖాన ననయము తిరివి విశ్వ మధురిమము, మంజుముకురము మాడ్కి నుండు ఆంధ్ర కామాయని 100 559