తే. తే. పిలువఁబడుచుండె భ్రమ యనుపేర చేత నా సుకౌశల స్కలన మనారతంబు దాని యొక బిందువున విషాద నదచయము పొంగి ప్రవహించుచుండె విస్ఫూర్తి గదుర. అదియె యపరాధ! మహహ!! అయ్యదియె విశ్వ దుర్భలత్వపు మాయ! అతుల వసుంధ రా వివర్జిత మాంద్యమ్ము రాగసంచి తోజ్జ్వల ధ్వాంత సుచ్ఛాయ! ఒహొహొ, అదియె!! తే. నీల హాలాహలమ్ముతో నిండి యున్న చంద్రుఁ డను కపాలమీదె హస్తమున నుండె! ఈ నిమీలిత తారలందెంత శాంతిఁ ద్రావి యీగతి నున్నాఁడ వీవు, దేవ! తే. పాన మొనరించుచున్నావు బహుళ విశ్వ గరళమును నీవు - జీవింపఁ గలుగు సృష్టి - మరల - నిత్యశీతలత యీ మాడ్కి నీకు వచ్చుచున్న దింతగను నే వంక నుండి? తే. అచలము ననంతమగు వీచికాళి మీద నాసనమువేసి కూర్చుంటివయ్య స్వామి! శ్రమకణమ్ముల పోల్కి తారకల నిటుల నిదె యొడలినుండి జార్చె దీ వెవరవయ్య! తే. అలసి నడకల వచ్చినా రరుగొ, దేవ! పాలపుంతను నక్షత్ర పాంథవరులు: రమ్య భవదీయ చరణ నీరజములందుఁ గర్మకుసుమాంజలుల నుంచఁ గడఁగినారె? అయిన వారికి దుర్లభం బైన నీదు స్వీకృతి లభించెనా? లేదు వెడలుడంచు నిత్యమును వచ్చు భిక్షుకనిచయ మటుల ఫలవిహీనతఁ ద్రిప్పి పంపఁబడుచుండ్రి. తే. 554 65 వావిలాల సోమయాజులు సాహిత్యం-1
పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/554
స్వరూపం