నభమునందున దశదిశాంతరములందు మలినమగు నుదాసీనత మసలె నిండి. తే. అతిశయ విదాహ మది వికలతను గలసి తే. యచటఁ బెంపొందుచుండె హృదంతరమున యుగయుగాల యసాఫల్య మొలయు నద్ది వడసి యవలంబనగఁ బైకి ప్రాకుచుండె. నిజ విషమతాపగరిమ నీ నిఖిలవిశ్వ మర్ది నాతంకత్రస్తత నంత వీడె బహుళమైన యంతర్దాహభరము వలనఁ బెల్లుగా నీలిమమ్ము వ్యాపించుచుండె. తే. ఉజ్జ్వలోద్వేలితమ్మయి యుండె నుదధి వ్యాకులతను దొరలుచుండె నలలగములు చక్రవాళంపు సురుచి రాస్పష్టరేఖ కమలిపోవుచు నున్నట్లు కానుపించు. తే. క్రమ్ముకొన్న పెన్బోగల కుండమ్ములోన నెటుల నటియించుచున్న దీ యిధ్మ కీల? తిమిరమను ఫణి గాఢరక్తిని తదీయ తే. హారి మణిమాల ధరియించె ననఁగ నుండె. పరమదుఃఖ దమసమాన భావమునను నీ జగమ్మెల్ల నేఁడు రోదించుచుండె దారుణంబగు నిర్మమత్వమ్ము కపట పెడఁద నిలువు నిలువున భేదించుచుండె. తే. తమిని జీవిత నిష్ఠుర దంశనముల వ్యాకులత్వ గుణోపేతమైన పీడ కన్నుదోయికిఁ గ్రీడయై కడఁగ నేఁడు నాట్యమొనరించు పాపసంచయము పగిది CJT. 55 60 00 ఆంధ్ర కామాయని 553
పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/553
స్వరూపం