Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/552

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తే. చెలఁగు లజ్జాయుతమైన జీవితంపు మంజులోద్దామ లాలస, మరియు నొక్క తీవ్రతరమైన యున్మాద తీక్షణత్వ మాత్మ నెవ్వేళ మథియించునట్టి యార్తి. తే. స్వాదువౌ విరక్తి గొలువ వరలు నాకు లతను నిండెను హృదయతారాపథమ్ము అయిన నయ్యెడ స్నేహంపు టంతరాగ్ని యర్ధి జనియించుచునే యుండె నాత్మలోన. తే. తెరచికొనుచు మూసికొనుచు నరయ భీష ణతనుబొలిచె నా యసహాయ నయనయుగళి కుటిలకటుత నిల్చినది సంకటము గదుర సరస సుస్నేహపాత్ర స్పష్టముగ నేఁడు.

తే. "ఎంత దుఃఖ మెడంద నే నెవరి వలతు నతఁడు రూపొందినాఁడు నే డన్యరీతి లీల మన్మనశ్చిత్రిత లేఖనమ్ము లౌర! సుందరస్వప్నమ్ము లయ్యె నయ్యొ! తే. మధుర మగు నీ పృథు మనోజ్ఞ మధువనాన జాగృతమ్మయ్యె దారుణజ్వాల యిపుడు ఎటుల చల్లారునో యిది యెఱుకపరుప నేర్తు రెవ్వరీ నీరవ నిర్జనమున. తే. అపరిమితము ననంత మీ యాకసమ్ము ఏ ప్రవేదనా నీడమై యెలయు నద్ది అలసతా రక్తిమలనిండి యస్మదీయ నేత్రవిశద పక్షముల నున్నిద్రమయ్యె. తే. వ్యాప్తినొందిన నీరవత్వమ్ము కరణి ననిలుని పదాలు కంపిల్లు నటుల నుండె 552 50 50 వావిలాల సోమయాజులు సాహిత్యం-1