కర్మ (ఆచరణ) తే. కర్మసూత్ర సంకేతమ్ముకరణి వరలి మనువునకుఁ దోఁచె మహితసోమలత అద్ది సజ్య చాపశింజిని యనఁ జాలియుండె మనువు కర్షించే జీవనధనువు మరల. తే. అతఁడు విడిచిన బాణమ్ము గతిగ-నదియె మార్గమున నగ్రసరుఁడయ్యె-మందరముగ నంత “యజ్ఞము, యజ్ఞము” అనెడి కటుకు కేక వినుట స్థిరత నుండలేకపోయె. తే. శ్రవణయుగళి నిండె బ్రసవశరుని పలుకు కలిగె నవ్యాభిలాష హృజ్జలజ వీథి మనువు యోజింప దొడఁగెను- మంజు రంజి తమగు నా పొంగులువారె తరిమి తమిని. తే. అంత సోమపాన ఘనదాహమ్ముఁ గొనిన రమ్యలాలస లోభవర్తనము నొందె, దీన జీవితవైభవోత్సేక మందు నుండియుండె నౌదాసీన్య మొలసి, బలిసి తే. పవన మది ప్రతికూల మై పరగి నపుడు తరణి లోతులకుఁ దిరిగి యరుగునటుల జీవితపు టవిరామ సుస్నిగ్ధ సాధ న మపు డుత్సాహమున నిల్చి కొమరుమిగిలె. తే. శ్రద్ధ పలికిన పోత్సాహరమ్య వచన ములు గుసుమశరప్రేరణ కలిసి భ్రాంతి నావగింజ గుమ్మడికాయ యైనయటులఁ గల్పనముఁ జేసి ముందుకుఁ గదలివచ్చె. ఆంధ్ర కామాయని 10 5 545
పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/545
స్వరూపం