తే. తే. వెట్టిదానివలెను నుపవిష్ట యగుచు నా యెద నెవతో ప్రలపిం చనారతమ్ము. ఏఁ దులనమొనరింప యత్నించినప్పు డెల్లఁ దూచఁగాఁబడుచుంటి నేనె-ఏను నరతరువునకు భుజలతఁ బిరిగఁ జుట్టి యాగు - టెండల నెవ్వేళ నూగుచుందు. ఈ సమర్పణ మందున నేమి కలదు? ఒక్క త్యాగమ్మె కనఁదోఁచుచుండు నెపుడు అఖిల మర్పింతు గ్రహియింప నణువునైన నిదియె సరళముగను దోఁచు మదికి నెప్పుడు. తే. "ఉవిద ! ఏ మని పల్కుచునుంటి నీవు ! చాలు - నీ సుసంకల్పాశ్రు బలము తోడ జీవితంపు స్వర్ణస్వప్న శేవధులను డొలుతనే దానమిచ్చితి కలికి! నీవు. తే. రమణిరో! కేవల మ్మీవు శ్రద్ధ - నీవు కడఁగి విశ్వాస రజతనగ పదజలము నందు జీవన సమత లాత్యంత భూమి నెనసి సురశై వలిని వై నదింపు మమ్మ! తే. సమర మత్యంత తీవ్రమై సాగు నమర జన జయములకు, దను జాపజయములకును అనయమును బ్రవర్తిల్లు మానసాంతరమున గాఢ మౌచు వైరుధ్య సంఘర్షణమ్ము. తే. అశ్రుకణసిక్తమైన వస్త్రాంచలమున నుంచవలయు నెడందలో నున్న దెల్ల మధుర దరహాసరేఖతో మగువ! నీవె ఈ సుసంధిపత్రమును లిఖింపవలయు” 544 45 47 వావిలాల సోమయాజులు సాహిత్యం-1
పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/544
స్వరూపం