Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/542

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తే. అగుదు దాదిని చపల యౌ యౌవనమున కేను-నేర్పెద గౌర వాహీన గరిమ తగుల నున్న యెదురు దెబ్బఁ దలఁచి యామె కేను మెలమెల్లగను నెరగించుచుందు. తే. ఏను రతిరాజ్ఞి నా దేవసృష్టి యందు విభుఁడు సుమబాణు వలన వివిక్తనైతి ఏ నిషేధంపు మూర్తినై యిప్పు డుంటి దీననై - సంచితాసంతృప్తి యెనయు నను... తే. అనుభవమ్మునను నతీతమైన దైన నా సఫలతను బోలి యున్నాను మిగిలి స్మరవిలాస దుఃఖిత, సలసటను గొన్న దాని, శ్రమదళితను బోలుదాన నిపుడు. తే. ఏను లజ్జనుఏఁ బ్రతికృతిని రతికి నేను శాలీనతాలీల నేర్పుచుందు మదము నొందిన సౌందర్యపదము నందు నూపురముగ నల్లుకొనుచు నాపుచుందు. తే. రాగరక్తిమనై కపోలముల యందు నక్షియుగళికి నయ్యెడ నంజనమ్ము గాఢ కుంచిత కుటిలాలకములఁ బోలి మానసమున నేను మెలినై మసలుచుందు. తే. తమిని జంచల శాబ్ద సౌందర్యమునకు నాచరించుచుందును రక్ష యనయ మేను శ్రవణముల కెఱఁదనము నొసంగఁజాలు చిఱుత మెలినినై యపుడు నేఁ జెలఁగుచుందు.”

తే. "ఔను, సరియె, కానిమ్ము నా యమలజీవ నంపు పథ మేమొ తెలుపఁగన్నా వె నీవు? 30 542 వావిలాల సోమయాజులు సాహిత్యం-1