తే. ఒనర రోమాళి సంకేతమును నొనర్చు నన్ను నాటంకపరచు మౌనముగ నిలిచి భ్రూకుటీ కాళరేఖికా పూర్ణరుచులు తెలియఁబడియెడి భాషయై యొలసె నపుడు. తే. ఇటుల స్వాతంత్ర్యమును సంగ్రహింతు వీవు పడఁతి! ఎవర వస్మ న్మనఃపరవశతవ! జీవనోద్యానమున వికసించి తావి దొరయు స్వచ్ఛంద సుమపాళిఁ ద్రుంచె దీవు." తే. నవ్వుచును నవసంధ్యారుణమ్ము మాడ్కి దానినే దేహముగఁ గొన్న తత్త్వ మొదవ రమణియపుడు ఛాయామూర్తి లలితగతిని శ్రద్ధ కీగతి బ్రత్యుత్తరమ్ము నొసఁగె తే. "ఇంత చకితవు కాఁబోకు మింతి! నీదు మనసు కుపకార మొనరించుకొనుము సుంత ఆగు మొక్కింత తలపోయు మనుచుఁ దెలిపి యాపుదల సేయు నడ్డంకు నౌదు నేను తే. గగన చుంబి తుహిన శృంగకముల నుండి కలరవోదిత కల్లోల గతులతోడ నవనవోల్లాస మంజు లోన్మాదమునను జంచలా ప్రాణధార నదించుచుండె. తే. పొలయు నం దుష్యకాంతిని బోలి మెఱయు తే. స్నిగ్ధ మంగళ కుంకుమ శ్రీరజమ్ము కులుకు నడలను గనుకట్టి కొమరుమిగిలి భవ్య హరితము వోలు సౌభాగ్యగరిమ. మనోజ్ఞతఁ గనెడి నేత్రాళి కయ్యెఁ గమ్ర కల్యాణ మహనీయ కారణమ్ము హ్లాదకుసుమము వికసించె - - నద్దిఁ దోచె గుణిత వాసంత కాకలీ కోకిలముగ. 540 15 20 వావిలాల సోమయాజులు సాహిత్యం-1
పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/540
స్వరూపం