Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/536

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తే. ఏను దినమంతయు బరిశ్రమించి యున్న పూషుఁ బోలుచు వర్తిలు పురుషవరుఁడ! శిశువు వలె నేటివఱకును జిక్కకుంటం దెరువు-విభ్రాంతి లోఁగొనఁ దిరుగుచుంటి. తే. ఈవు విశ్రాంతి నొసఁగు రాకేందుబింబ కాంత చంద్రికా విసరమ్ము కరణి నొప్పి విజయినివి వోలె, మాధుర్యవిచి వోలె సరస నౌచుఁ దోఁచెదవు ప్రశాంతముగను. తే. సస్యసంపత్తి వెల్గొందు శ్యామభూమిఁ బాదదళితమ్ము నాక్రాంత బంధురతను నమితమును నయి శాంతితో నంతమొందు వర మహాయాసమును గొన్న ప్రజ్య యటుల. తే. అహహ! ఏమియో!! యీ గతి నగుచునుండె మామకీన మనఃపరిణామ మిపుడు !! మానసజలేజ మర్పించి మమతఁ దవిలి యేను నా కామ్యమును గ్రహియించుచుంటి తే. విశ్వరాజ్ఞిరో సౌందర్యవిభవరాశి! గురుత రోజ్జ్వలరస జగద్గారవమ్ము చేతనోపేత మైనది, స్నిగ్ధమధుర మీ సమర్పణమును స్వీకరింపుమమ్మ” తే. చెలఁగు వలపున శిశిర నిశీథ మందు తత నవ తుహిన భారానతమ్ము గాన వ్యోమ తరువును మంజుల ధూమ లతిక సోలు చధిరోహణము సేయఁజాలకుండె. తే. పురుష నర్మోపచారముల్ పొంది యంత 536 సంకుచిత యౌచు నొప్పె నా శ్యామలతిక రమ్య సౌకుమా ర్యాత్త భారమును గొనఁగ వంగె నాయమ క్రీడా శుభాంగి యగుచు. 95 100 వావిలాల సోమయాజులు సాహిత్యం-1