అంత్యకిరణము వసుమతియందుఁ బొరలి యస్తమయ మగుచున్న, దయ్యదియె, కనుమ! తే. ప్రకృతి సుస్వాప్నిక ప్రౌఢపాలనమును, రమ్య సాధనా మోహన రాజ్యరమను, పద, అమేయ మధుర విభా భరితమైన కౌముదిని జూచివత్త ముద్దాఢరతిని. తే. సృష్టి హసియింపఁ గడఁగెఁ బ్రహృష్ట యగుచు వలపు వికసించె లోచనపాళికలను ఉదిత రాగరంజిత యౌచు నొప్పె జ్యోత్స్న ప్రసవములు వెదజల్లెఁ బరాగధూళి". తే. మనువు-హస్తమ్ముఁ జేపట్టి మమత యొదవ హసన విస్ఫూర్తిఁ జెలువొందె నతిథి - అంత నిరువురును స్నేహపాథేయ మిచ్చఁ గొనుచుఁ దరలి నడచిరి స్వప్నపథమ్ము వట్టి. తే. పారిభద్ర నికుంజ గహ్వరము లిప్పు డన్నియును సుధాస్నాతమ్ము లగుచునుండె సలుపుకొనుచుండె నవ్వేళ సకల మొలసి యుజ్జ్వలముగ జాగరణరా త్యుత్సవమ్ము. తే. పుష్పరస సిక్త మాధవీ పుణ్యగంధ వీచికావళి దిక్కుల విరియసాగె మధువు సేవించి మత్తెక్కి మారుతములు మిట్టిపడుచున్న వొకదాని మీఁద నొకటి. తే. ధీరయామినీ ఛాయాశరీర మిపుడు శిథిలమై యంత నలసతఁ జెంది, తివిరి యతుల మంజు తుషార శయ్యాంతరమున దీర్ఘవిశ్రాంతిఁ గొనుచు నిద్రించుచుండె. 55 60 530 వావిలాల సోమయాజులు సాహిత్యం-1
పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/530
స్వరూపం