Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/528

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తే. సకలమున పశువునను, బాషాణమందు నృత్య నవమంజు నిస్వన మిమిడియుండె అందరను దన్వి, ప్రీతి సానందముగను గడఁగి పిలుచుచున్నది యొక కౌఁగిలింత! తే. శాంత సంచితప్రణయ మశ్రాంత మిపుడు పృథులరాసులు గాగ వ్యాపించియుండె అట్టి వలపును గైకొని యప్పుగాగ దీనజగము సంతరించుచుండె. నిది తే. అమృతమోహన! అరుణమేఘాళి సజల చారుసచ్ఛాయల దినాంతసమయ మందు లలిత లతికా మనోహర లాస్య లీల ఏను వీక్షించుచున్నాఁడ నిచ్చమెయిని. తే. సహజ మోహన ఘన విలాసమ్ముతోడ, సరసధీర పదన్యాస చతురిమలతో, మంజుగతులను వచ్చె నా సంజయందు మధుర మాధవయామినీ మానినియును. తే. ఏలనో యెవ్వరు నిపు డియ్యెడను గనఁగ మహిత విధ్వస్త సురుచిర మందిరంపు దీనమును శూన్యమును నైన కోణమున వ సించి సమ్మర్ద మొనరించు టెరుకపడదు. తే. స్థిరనివాసమ్ముగా దానిఁ జేసికొనియె మాయ-ఏమి యీ సుఖనిద్ర? మాన్యగతుల చారు హిమధీర నవ్యహాసమ్ము మించి మెఱయుచున్నది గుణసమున్మేషమునను. తే. సరస భోగవిలాస సుచ్ఛాయ! స్వస్థ మధురశక్తి సువిశ్రామయా! మనోజ్ఞ మానసనివాస సౌందర్య మంజుప్రతిమ! ఎవరవు? ఛవిధామనువు, నీ వెరవవోసి! 528 45 వావిలాల సోమయాజులు సాహిత్యం-1