తే. చిత్త మే సీమయందో వసించుచుండె ఏమి జరిగిన, దీ రీతి యేమి నేఁడు!" శాంతి నొందెఁ దృప్తమగు నిర్ఘ్యాఫలమ్ము అతిశయమ్మగు నావేశ మణఁగిపోయె. తే. అమల కోమల కాంత హస్తాళి నతిథి శీతలస్పర్శఁ దనువు స్పృశింపసాగె అట్టి రూపమనోజ్ఞత నర్థిఁ జూచి యపుడు మనువును నొకకొంత యుపశమిల్లె. తే. మనువు పలుకంగ సాగె ని మ్మాడ్కి "అతిథి! ఎచట నజ్ఞాతముగ వసియించుచుంటి వీవు ఏ సహచరుఁడ నీ కిప్పు డెడఁద నెదియొ సులభభవిష్య మూహించుచుంటి. తే. అమృతగంభీరమును మహితార్ధ మైన చిరతర స్నేహసంప్రాప్తిఁ జెందియున్న నిప్పు డీ స్థితి యేలనో-ఎరుకపడదు! డీ ఏ నభీరుఁడ నగుచుంటి నేల యిటుల? తే. ఎవరనో నీవు న న్నిప్పు డిటుల నీదు వంక కాకర్షణము సేతు వనిత! ఏను స్వయముగను నిన్ను వాంఛించు సమయమందుఁ దొలఁగిపోవుచునున్నావు దూరమునకు. తే. ఓసి జ్యోత్స్నా స్రవంతికా! యుత్సహించి నేడు నా దృష్టి నీ యెడ నిలుపదేమి? అర్థి నిను గమనించినా నన్న నమ్మ కమ్ము నిపుడు కోల్పోయిన కరణి తోఁచు. తే. లతికలును, వీరుథమ్ములు రమ్యఫణితి దాన మొనరించుఁ గాంతి నెద్దాని కిప్పు డట్టి శోభాసులలిత రహస్య మెదియొ తరుణి! నీలోన నిబిడమై దాగియుండె. ఆంధ్ర కామాయని 35 40 527
పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/527
స్వరూపం