Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/525

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తే. లలితముగఁ బులకిత రోమరాజి నొప్పు జలదరింపు శరీరాన నవదరించి తే. తే. యంతఁ బశువు ప్రదక్షిణం బాచరించి యతిథిచుట్టును వలపన్నె నక్కజముగ. అది యమాయక నేత్రాళి నతిథిమోముఁ గనుచుఁ గనువాని కనుల కగ్గలిక గలుగ సకల సంచిత స్నేహ ప్రసాద భరము దృష్టి మూలమ్ముగాఁ గ్రుమ్మరించె నపుడు. అతిథి యొనరించు లాలనయందుఁ దోఁచు స్నేహశబలి తోత్సాహ సుస్నిగ్ద గరిమ మంజు మమతా ప్రపూరిత మానసాబ్జ బహుళ సద్భావ చిహ్నమై పఱగుచుండె. తే. అటుల వీక్షించుచునే యుండ నతిథి, పశువు సన్నిహితులై సృజించిరి సరళ రుచిర మధుర ముగ్ద విలాససంపత్తి పొదలఁ బ్రణయ మాధుర్య ఘనరసపారణమ్ము తే. అట్టి రాగవిభూతి యీర్యానిలమున వ్యస్తమయ్యెను చిందరవంద రయ్యె మరియు నారిన యీర్యాగ్ని వరకణాళి జ్వలితమయ్యె స్ఫులింగచయమునోలె. తే. కాని యిది యేమి? ఈ రీతి గళము నొక్క విషపుగుటక ఈ యెక్కిళ్లు వెడలు టేమి? ఎవరు కల్గించుచున్నారు హృదయమందు నిద్ధ వేదనామయ మగు నిర్ష్యనిటుల. తే. అహహ! ఈ పశు! వింతటి యద్భుతంపుఁ బరమ రమణీయ మోహన ప్రణయ మిద్ది ఏ నొసంగు నన్నమునఁ బోషింపఁబడెడు నీ ద్వయమ్ము నిత్య మిట నీ యింటియందు. ఆంధ్ర కామాయని 25 525