తే. అపుడు కరుణాప్రపూర్ణదృశ్యమ్ము నొక్క డీ దరిద్రమేళనము సృజించుచుండె శోకసంభరితార్తితో కోకయుగళి తే. తే. విడిచి నిజ నీడమును విడివడియె నంత. మహితగతి నిప్పుడును ధ్యానమగ్నుఁ డగుచు మనన మొనరించుచున్నాడు మనువు - అతని శ్రవణములు నిండియున్నవి ప్రసవశరుని దివ్య మహనీయ మంజు సందేశగరిమ. ఇట గృహమ్మునకు నధికారేద్ద మైన యుపకరణ వస్తుసముదయ మొప్పు మీరె అఖిలసస్యాళి, పశుతతు, లన్యవిభవ ములను సంపాదనము సేయు పొలుపు మెరసె. తే. అతిథి హృద్గత మంజులాద్యతనకాంక్ష మనువు నాకర్షణము సేసె మహితశక్తి న య్యతిథి సేయు సంకేత మమితరుచిని సరళ శాసనమై మించి సాగఁదొడఁగె. తే. మనువు కౌతూహ లాయత్త మతిని నిలచి యగ్ని శాలాంతరమ్మున నరయసాగె నచ్చెరువుతో స్వతంత్రమౌ నాత్మవిధి లీల క్రమమున సాగెడురీతి నెల్ల. తే. ఉజ్జ్వల మ్మొహోహో! ఇది యొక్కమాయ! అతిథి వెంబడి యొకపశు వరుగుదెంచె తే. కరుణతోడ విమోహమ్ము కడగి మెరసి నది యపుడు సజీవముగ సనాథముగను. చపల కోమలహస్త మా సత్వవపువు నిమిరె సర్వాంగకములు - సున్మిషత మైత్రి నెత్తి నిజ వాల మద్ది యాడించు చప్పు డామె వెనువెంట సుగ్రీవ మగుచు నమరె. 524 15 20 వావిలాల సోమయాజులు సాహిత్యం-1
పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/524
స్వరూపం