Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/522

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వాసన (అనుబంధము) తే. భ్రాంతి వివశత నడచుమార్గమ్ము తప్పి, యంపు నెఱుఁగని పథికుల యటులఁ దోఁచు హృదయములు రెండు కలియఁగా నిచట దీర్ఘ పయన మారంభమొనరించె నియతి నెపుడో. తే. ఆ ద్వయమ్మున గృహమేధి యైన నొక్క రతుల విగతవికారంపు టతిథి యొకరు ఒకరు ప్రశ్న యైనను మరి యొక్క రౌదు రుజ్వ లోదార మైన ప్రత్యుత్తరమ్ము. తే. ఒకరు జీవనసింధు వై యొప్ప నొక్క రగుదు రమల మోహన విలో లాల్పలహరి పరగ నొక్కరు నవ్యప్రభాత ఫణితి నత్యనర్ఘ భర్మకిరణ మౌదు రొకరు. తే. గాఢ వర్షాజలోద్దామ గగన మైన నొకరు రెండవవా రౌదు రుదిత కిరణ రాగ రంజిత లక్ష్మీ విలాసగరిమ మేళనముఁ గొన్న మంజుల మేఘరవము. తే. ద్వీపవతి కట నవ్వలి తీరమందు క్షితిజసీమను మలి సంజ చెలఁగు జలద ముజ్జ్వలోజ్జ్వల మధురిమ యుత్సహించి యాడుచుండెను చపలాద్వయమ్ము తోడ. తే. చేతనాశక్తియుతము లై చిరము నచట పాశములు రెండు ఘర్షణపడుచు నుండె అం దొకటియు రెండవదాని నధిగమించి పట్టి నిలుపఁజాలదు తన వాగురులను. 522 10 5 వావిలాల సోమయాజులు సాహిత్యం-1