తే. కమ్ర సృష్టి కెద్దాన వికాస మబ్బె తే. నద్ది ప్రణయము - వినిపింప నర్థి దాని మధురసం దేశ ముజ్జ్వల మహిత శక్తి యొకఁడు వచ్చెను బ్రకృతిలో నునికిఁ గొనఁగ. దంపతుల మైన మాకు సంతాన మదియె అది మనోజ్ఞము నత్యమాయకము నౌను రమ్యవర్ణాలి వలచి ఖేలనమొనర్చు సర్వ మోహన మధుపుష్ప శాఖ యద్ది. తే. పరుగు జడ చేతనములకు బంధ మదియె - అద్ది భ్రమపరిక్రమపాళి కగును రమ్య తమ పరిష్కార-మగును శీతలత శాంతి సహిత జీవితోష్ణ విచారసమితి కద్ది. తే. "పడయఁగా దాని నాకాంక్ష వరలెనేని యోగ్యతావాప్తి కింక నీ వుదియఁగొనుము" అనుచు నాకస్మికమ్ముగా నాస్వనమ్ము మూకతను జెందె నాయెడ మురళివోలె. తే. అంత మనువు కన్నుల విప్పి యడిగినాఁడు! “మమ్ము నచటికిఁ జేర్చెడి మార్గ మెద్ది? ఎవ్వరేని యా జోతిర్మయిని నెటువలెఁ జేరఁగాఁ గల్గెదరు దేవ! చెప్పుమయ్య!” తే. తే. ఎవరు లేరు సమాధాన మిచ్చువారు, భగ్నమయ్యె విలక్షణస్వప్న - మతఁడు పరపి నేత్రాళి సుందర ప్రాచ్యదిశను గనియె రసపూరి తారుణ గాఢసుషమ. జమిలి మెఱయ వల్లీ నికుంజములలోన రమ్యముగ నాడె హేమాభరశ్మి యపుడు నిల్చియున్నది మను కరనీరజముల దేవతా సోమరససుధా దివ్యలతిక. ఆంధ్ర కామాయని 65 67 521
పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/521
స్వరూపం