Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/520

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తే. అమరులే లేరు వారల యా సుభోగ గుణవిలాసము లే, దనంగుఁడను చేత సత్వ మొక్కటే యున్న - దస్తిత్వమునకుఁ దిరుగుచుంటి - సంచితకథాసరణి యిద్ది. తే. నిత్యరమణీయ కృతులకు నీడ - మిద్ది కమ్ర విశ్వము - కర్మరంగస్థలమ్ము ఎవరి కెంత బలమ్మున్న నిచట నంత గను వసిం త్రిదియును క్రమ గతిని దోఁచు. తే. సాధనామాత్రులై యున్న జన మనంత సంఖ్య నున్నవా రవ్వారు చతురిమమున మొనసి యారంభ పరిణామములకు నేయు చుంద్రు రమణీయ సంబంధ సూత్రములను. తే. ఇంద్ర నీలాంబరాన వ్యాపించు నుషసి రమ్య కాశ్మీర ఘసృణవర్ణమ్మ దేమి? ఎన్నడేని దానినిఁ దిలకించినావె వర్ణములఁ బొల్చు జలదడంబరము నందు? తే. రేబవళ్ళను విభజించు లీల నిద్ది ఇద్ది కర్మసాధనను వ్యాపింపఁ జేయు నమల మాయా వినీలాంచలమున నిద్ది చెలఁగి యాలోకధార వర్షించు నెపుడు. తే. మలయు ప్రారంభ వాత్యోర్గమమ్ము వంటి వాఁడ నా వలననె సృష్టి ప్రగతి జరిగె మానవుని శీతలచ్చాయ మామకీన కృతిని మోహనముగ సంస్కరించుకొరకు. తే. వ్యసన సంయమోచిత జంతు వర్తనముల స్వచ్చవికసన యొదవె జీవనమునందు కామభావనము ప్రళయకాలమందు నాశమగుటకుఁ బూర్వ మున్నతి వహించె. 520 55 60 వావిలాల సోమయాజులు సాహిత్యం-1