తే. "నన్నె యెవ్వేళఁ గొలుచుచు నున్నవారు నే నొనర్చెడి సంజ్ఞయే నియమమయ్యె అస్మదర మైన ఘనమోహము సృజించె నమరజన విలాసపు వితానాళివలచి. తే. స్మరుఁడ నేనె వారికి సహచరుఁడనైతి నెనసి వారి వినోదసాధనము నైతి నవ్వుచును నుంటి నవ్వించుచుంటి నేను వారి కృత్రిమజీవమ్ము పగిది నుంటి”. తే. ఎవతె యాకర్షణమయి హసించు నింతు లందు నది రతి ఆద్యమౌ వ్యసన మద్ది ఉన్న దద్దాని యిచ్ఛ సముజ్జ్వలముగ యమరు నవ్యక్తముగ ప్రకృత్యంతరమున. తే. అమ్మహాప్రథ మావర్తనమ్ము నందు నుండె నస్తిత్వ మొక్క మా యుగళమునకె ఒదవె నీ సృష్టిరూప మందుండి - అందు నర్తనము సల్పు మూర్తు లనారతమ్ము. తే. పుష్పవతి ప్రకృతిలతా ప్రఫుల్ల యౌవ నమున మాధవు మధుహసనమ్ము విరిసె నద్ది సృష్టింపఁగా గల్గి నపుడు తొల్త మధుర రూపద్వయమ్ము సమాహితముగ. తే. జడతఁ బోఁద్రోలి యా మూలశక్తి యంత నిలిచినది లేచి - యద్దాని నియతరాగ వృత్తి గ్రహింయిచుచును బరుగెత్తుకొనుచు వచ్చి చేరిరి పరమాణుబాల లపుడు. తే. అంతరిక్ష మధూత్సవ మందు మెరసి 518 యుదిత విద్యుత్కణమ్ము లన్యోన్యముగను గూర్మిఁ జల్లిన కుంకుమక్షోద మటులఁ గౌఁగిలింతకుఁ ద్వరపడుకరణిఁ గలిసె. 40 45 వావిలాల సోమయాజులు సాహిత్యం-1
పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/518
స్వరూపం