తే. అమిత కల్లోల భరితమైనట్టి తరఁగ లందు మత్తిల్లి చరియించు నా సుశక్తి కొలువగా మాని జ్యోత్స్నావకుంఠనమ్ముఁ దీసి కన్పట్టనెంత సంతృప్తి యెదవు. తే. ఫేనయుతమైన, పడగను విసిరికొట్ట స్నిగ్ధమణిగణమ్ముల రీతిఁ జెదరి తోఁచె మమతఁ బాడుచున్నట్టు లున్మత్తముగను నిద్రఁ గూరెడిపగిదిని నెగడి తోఁచె".
తే. "రమ్యజీవన మధురభారమ్ము నెప్పు డెద్దివచ్చినను తిరస్కరింపలేను - సంయమ క్లేశ దమనసంచయము రూపు నొంది చనుదెంచెనేని నే నుజ్జగింప. తే. కనఁగలరె మీరు నక్షత్రగణములార ! యుషసి అరుణిమ మది యెంత యుజ్జ్వలమ్మొ కడగి నింపుచున్నయది సంకల్ప మద్ది ఇందు సందేహ మిసుమంత యేని కలదె? తే. ఏమి కౌశలమది యెంత కోమలమ్ము? అమృతసుషమ దుర్భేద్యమా? అరసినంత నాదు నింద్రియములు చేతనత్వ మగునె కడకు నా యోటమికిఁ దొలి కారణమ్ము. తే. త్రావుచుంటిని, ఔను, నేఁ ద్రావుచుంటి స్పర్శరసరూప గంధసంభరిత మైన యట్టి దానిని మధురోర్మిఘట్టనమున నిస్వనము ప్రతిధ్వనులతో నిండినదియె? తే. పరఁగి యొక్క నక్షత్రరూపమున నాదు స్వాప్నికోన్మాదము చెదరిపడెన? ఏమి 516 30 వావిలాల సోమయాజులు సాహిత్యం-1