Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/512

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కామము (అనురాగము) తే. "జీవనోద్యాన మధుమయ స్నిగ్ధసురభి ! అంతరిక్షపు టలలఁ బ్రయాణ మొనర సల్పి శార్వరిలో ఁదుదిజాము నందు వచ్చి తెవ్వేళ నిటకు సవ్వడియె లేక. తే. ఈవు వచ్చుటఁ జూచెనా యేమి పల్కుఁ క్రొత్తలుగ నిప్పు డున్మాది కోకిలమ్ము? నీరవత్వాన నలసతం గూరి ముగ్ధ ముకుళములు ప్రీతిఁ దమ నేత్రములను దెరిచె. తే. తమినిఁ గ్రీడగ ముకుళాన దాఁగు టీవు చేరి నేర్పెడి వేళలో శిథిలసురభి వలనఁ గల్గదె మసృణంపు బటల మవని? అగును గాదా? నిజ మ్మెదో యనుము నీవు. తే. పుష్పవసనాంచలమ్ములఁ బొలుపు మెరయ నీవు సరసహాసమును లిఖించు వేళం కొండయేరుల జలజల గొంతుకలతొ నీవు మధురకంఠమ్ము జోడించినపుడు. తే. ఎంత నిశ్చింత, యుల్లాస మెంత యున్న వహహ! పిక కాకలీస్వన మందు-బలిసి తే. 512 జీవన దిగంత గగనానఁజెలఁగి మారు మ్రోగుచున్నది నవనవామోద మపుడు. చెలఁగి చాంచల్యమున నాఁడు చిత్రకార శిశువు చిత్రించె నత్యాశ స్నిగ్ధరుచుల మంజు జీవన నేత్రాళి మసకకాంతి యుత మగు లిపి మనోజ్ఞమై యొదవఁజేసె OT 5 వావిలాల సోమయాజులు సాహిత్యం-1