Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/505

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తే.
ఎసఁగు జిక్కుల బ్రతుకు ప్రహేళికగను
దాని విడదీయ నెపుడ యత్నమ్ము సలుప
నించుకయు - నర్థ మేమియు నెరుకపడదు
విడిచి యూహలఁ గాలమ్ముఁ గడుపుచుంటి.

తే. "తమి నెసంగిన యా యతీతమును రేలుఁ
బవలు మరచిపోవఁగ యత్నపడుచు నుంటి
దీన జీవితసంగీత మైన యద్ది
తిమిరగర్భాన నొదిగి దూరమగుచుండె.


తే. ఏమి చెప్పను, నే లక్ష్యహీనుఁడను వి
నీల గగనావకాశాన నేను దారి
చెదరిన పవనోర్మి యటుల శిథిల విధుర
శూన్య రాజ్యమ్ముగ వసించుచుంటి నిపుడు.


తే. ఒక యచేతన స్తూపమ్ము నొక్క స్మృతికి
ఒక్క సుషమకు మాసిన ద్యుతిని నేను
రమ్యజడతకు జీవనరాసి నగుదు
కడు సఫలతకు నే మోసకారి నిపుడు.


తే. ఎవ్వరవు? ఘోరగ్రీష్మన ని వ్విధాన
తోఁచెదవు మృదువాసంతదూత వోలె,
నంధతమసాన హ్రాదిని యటుల తపన
యందు శీత సురభిళ మందానిలముగ.


తే. తారకాశాకిరణ తుల్యతను జెలంగి
కవి మృదుల మానసమునకుఁ గాంతకల్ప
నంపు దివ్య లఘు లహరి నాఁగ నాదు
చిత్తవైక్లబ్యము శమింపఁజేతు నీవు.”


ఆంధ్ర కామాయని

505