రక్త కిసలయమున నభిరామముగను
నలసతను బొందెనో యన వద్ది యొప్పె.
తే. నిత్య యౌవనచ్ఛవిని నిర్ణద్రమగుచు
విశ్వ కరుణా సుకామనా విమలమూర్తి
భూరి సంస్పర్శ కర్షణాపూరితమ్ము
జడమునను స్ఫూర్తిఁ గల్గింపఁ జాలు నద్ది.
తే. ఉదయతారకారుచి యను నొడిని విడిచి
వెట్టి సిగ్గున మత్తిల్లి వెడలినట్టి
యుషసి తొలి సుకాంతకిరణ ముజ్జ్వల మధు
రతను, నార్ధమోదానఁ బూర్జ మగు నద్ది.
తే. అద్ది కుసుమ కావనఖండ మందు మంద
పవన చాలిత సౌరభప్రవర మొలసి
యరుణరాగయుతము మరందార్ధ మగుచు
రూపుధరియించెనో యన నోపియుండె. 15
తే. సురభిసమయరాకా నవజోత్స్న పడిన
యట్టు లొప్పె నా మధు మందహాస మపుడు
దాని మదవిహ్వల మ్మైన తరుణకాంతి
పుష్పరస సార్ధ గంధోర్మి వోలెఁ దోఁచె.
***
తే. "వసుధగగనాల మధ్య జీవనము కనఁగ
నతిరహస్యము నిరుపాయ మయ్యె-తిరుగు
చుంటి మండెడి యుల్కనై శూన్యమందుఁ
తో డెరుంగక" యని మను వాడినాఁడు.
తే. “ఎటుల దీన నగము ప్రవహింఁపఁజేయ
లేదొ సెలయేటి, నెటు చేరలేదొ-కరగ
నట్టి హిమము నిర్ణయిరరూప మంది కడలి
యొడిని, అటులె, పాషండుఁడ, నుంటి నేను”.
***
504
వావిలాల సోమయాజులు సాహిత్యం-1