ఈ పుట అచ్చుదిద్దబడ్డది
తే. ఏను నిపు డెదియొ మరచినాను స్మృతికి
రాదు, ప్రేమయో, వేదనా, భ్రాంతి యౌనె?
ఎద్ది మరి? కాక సుఖముగా నెందు నిదుర
మలఁగి నా మది యద్ధాని మరచినదియొ!
తే. ఎచట నేని నీ కదియు యాదృచ్ఛికముగ
గోచరించిన నదియుఁ బోఁగొట్టవలదు
భాగ మద్దాన నీకు నేఁ బంచియిత్తు
మరువకుము దాని నేనియు మగువ! నీవు. 80
ఆంధ్ర కామాయని
501