విమల శీతలత వ్యధిత విశ్వమునకు
నవ్యగుణబిందు వౌచు నున్నావు నీవు.
తే. అమిత సంతప్త జీవన హర్షదాయి
శాంతి సహిత ఛాయాప్రదేశమ్మ! ఇప్పు
డగణిత మనోజ్ఞరూపాళి నమరి యెంత
స్వాదు మంజు సందేశ మొసంగె దీవు.
తే. రమ్యతమ మౌనము వహింప నెచటనీవు
నిట్టి చతురిమ మెలమి నార్జించినావు
ఓసి, యింద్రజాలజనని! ఉజ్వలనిశి
నింత మధురవు నీ వైతి వెందు కిటుల?
***
తే. తారకాదీపముల నబ్ధితటము కడకు
దీప్తి మలిసంజ యేతేర దివ్యరజని!
దాని చాంపేయవర్ణ వస్త్రమ్ము చించి
తివిరి నవ్వెదవేల ప్రతీపముగను?
తే. అంధకారాన నశ్రుకణాళిఁ గలిపి
చతురత ననంతకాల శాసనపు స్వైర
చరితమును వ్రాయువేళను శక్తి మెరయ
నిటుల నాకస్మికముగ హసించు వేల? 70
తే. విమల రజనీమతల్లికా! విశ్వకమల
మృదుల మధుకరివి సొగయ నెచటనుండి
వచ్చి మంత్రమ్ము పఠియించి ప్రాణికోటిఁ
బ్రీతిఁ జుంబించి పోయెదవే లతాంగి!
తే. ఎక్కిళుల వలె నిట్టూర్పు లే దిగంత
రేఖకడ మెల్లగా సంతరించి యిటుల
గాలిరొద యను మిష సువేగాన రొప్పు
చెవరి జేరంగ నీ విపు డేగె దతివ!
ఆంధ్ర కామాయని
499