Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/493

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. విశ్వకల్పన పోలిక శశ్వ దున్న
    తమ్ముగా నొప్పు శీతభూధరము అద్ది
    పృథ్వి కాలంబనము - సుఖప్రీతిదమ్ము,
    సకల మణిరత్న సముదయ జన్మభూమి.

తే. అచల హిమవదాహార్య శోభాత్త వల్ల
    రీ కలిత శుచిసాను శరీర మొప్పు
    నొక సుఖస్వప్నమున నిద్ర నున్నతరిని
    నొలసి రోమాంచ కంపన మ్మొందినట్లు.

తే. శస్త హిమనగ పాదదేశమ్ము నందు
    నీరవత్వామల విభూతి నిండి పొంగు
    అచట నిరయిరిణీ ప్రవాహమ్ము లిప్పు
    డర్థి వెదజల్లు నవజీవనానుభూతి.

తే. అమల నిస్సీమ నీలాంబరాంచలమున
    నెవరి మృదుహాసమో చూచి హిమనగంపు
    మందహాసము కలగాన మహిమ మెరయ
    బయలు వెడలెనొ యన నవి వరలఁదొడంగె. 30

తే. అట శిలాసంధులను మహితానిలమ్ము
    తాకి గుంజారవమ్ములఁ దమిని నింపె
    పరమదుర్భేద్య మైన యా పర్వతంపు
    ద్రడిమఁ గీర్తించు మాగధప్రవరు నట్లు.

తే. మహిత సంధ్యాసమయ మేఘమాల లనెడి
    సుందరానేకవర్ణ సంశోభి వస్త్ర
    ములను గప్పి, మంచుమకుటముల ధరించి
    గగనచుంబి శైలశ్రేణి గానుపించు.

తే. ఆ విభవ పరిపూర్ణ మహాద్రిపంక్తు
    లమర విశ్వమౌనంపు మహత్వగౌర
    వములకును బ్రతినిధుల ట్లపార విశ్వ
    సవిధమున మూకతను సభసల్పై ననఁగ.


ఆంధ్ర కామాయని

493