తే. బహుళ రంజిత విజన విశ్వమ్మునందు
మనువు చూచె విశ్వైకాంతమహిమ అదియుఁ
దుహిన శీతల జడతగాఁ దోఁచె - నచట
నిఖిలకోలాహల మలసి నిద్రవోయె.
తే. సోమరహి తేంద్రనీల సంశోభి చషక
మపుడు బోరగిలఁబడి వ్రేలాడుచుండె
ఆపద సమస్త మరిగెనో యనగఁ బవన
మర్థి మసృణసునిశ్వాస మాచరించె.
తే. ఆ విరాట్టు కొంగొత్తరంగద్దఁ దలఁచి
కలుపుచున్నాఁడు హేమ మకల్పముగను
ఉద్భవించెను మనువున కొక్కపరిగ
నెవ్వఁ డతఁ డను ప్రశ్న -జనించె కోర్కె.
తే. వేనియాజ్ఞకు బద్ధు లీ విశ్వదేవ
వాయు పవమాన పూషాది వరగణమ్ము?
ఎవని శాశ్వత పాలన నిట్లు నడతు
రా మరుత్తు, సోముఁడు వరు ణాదిసురలు? 10
తే. అతని భ్రూభంగ మగుఁ బ్రళయమ్ము తలఁప -
అట్టి ప్రళయాన వికలత నందినారు
ఆ ప్రకృతిశక్తికిఁ బ్రతీకలైన నేమి,
యెంత దుర్బలు లైరి వారిపుడు చూడ!
తే. సర్వభూత చేతన, పృథుశక్తి గణము -
వికలతను జెంది యపుడు కంపించిపోయె
వివశులు నుపాయశూన్యులు వీర - లపుడు
వీరి కెంత దుర్దశ సంభవించె నయొయొ!
తే. కాము దేవతలము మేము- కారు వీరు
భూరి పరివర్తనపు హస్తపుత్తలికల
మగుడు - మరయ నున్నాము మే మందరమును
గట్టఁబడి గర్వరథతురంగమ్ము లట్లు.
490
వావిలాల సోమయాజులు సాహిత్యం-1