Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/480

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. "రత్నదీప ఘనాంధకారమ్ముఁ బోలు
     నల నిరాశా సహిత భవిష్యమ్మ! ఓసి,
     అమరజన ఘనాహంకార యజ్ఞవాటి
     రమ్య సర్వస్వమును హవిర్భాగ మయ్యె!

తే. "తరళ మృత్యు రాహిత్య పుత్తలికలార!
     ధన్య భవదీయ జయ నినాదములు ప్రబలి
     శబలితస్వన దైన్య విషాద మొదవ
     నిప్పటికిని బ్రతిధ్వనియించుచుండె.

తే. "అరయఁ బ్రకృతి యున్నది యజేయమ్మె యగుచు
     జితుల మైతిమి, యవివేక చిహ్నితులము
     మరచి మధుపానమత్తత న్మమ్ము మేమె
     యీదుచుంటిమి తౌల్యంపు టేటినీట.

తే. "వారు మునిగిరి, మునిఁగెను వైభవమ్ము
     ఆ సమస్తమ్ము రూపొందె నబ్ది పగిది
     దేవతా సుఖవితతిపైఁ దెరలి యంత
     దుఃఖజలధి నినాదమ్ము తుఱఁగలించె.

తే. "అట్టి మత్తవిలాస మే మయ్యె? అరయ
     స్వప్నమో! కాక మృదుల విభ్రమమొ యద్ది
     స్వర్గజనలోక సుఖవిభావరి చెలంగె
     తరుణ మహనీయ తారకాతతుల తోడ. 25

తే. "అమరతరుణీ సుగంధ వస్త్రాంచలముల
     సౌఖ్య జీవనపవన నిశ్వాస మొద వె-
     వరలు సౌపర్య సౌఖ్యవిశ్వాస మపుడు
     ముగ్ద కోలాహ లోజ్వల ముఖరితమ్ము.

తే. "అది సుఖము! కేవలము సుఖ మహహ! అద్ది
     అమల మందాకినీ ప్రవాహమ్మునందు
     పృథు తుషారములు ఘనీభవించినట్లు
     త్రిదశజన సుఖమయ్యె కేంద్రీకృతమ్ము.


480

వావిలాల సోమయాజులు సాహిత్యం-1