“ఆఖాతో మనసశ్చ” ఇత్యాది (1 అధ్యాయము 5 బ్రాహ్మణము) ఋగ్వేదమున ఇడను బుద్ధిని సాధన చేయునట్టియు, మనుష్యునకు చేతనను ప్రదానము చేయునట్టియు 'ధీ' అని చెప్పియున్నది. పూర్వకాలమున బహుశః ఇడకు పృథ్వి మొదలైన వాటితో సంబంధమొనర్చ బడినది. కాని ఋగ్వేదము 5-5-8లో ఇడా సరస్వతులతో బాటు మహి యొక్క ఉల్లేఖనము స్పష్టముగా వేరుగా నున్నది. "ఇడా సరస్వతీ మహితిస్రో దేవీర్మయో భువః" వలన మహి నుండి ఇడ భిన్నమైనదని తెలియుచున్నది ఇడ “మేధస్ వాహినీ నాడీగా కూడ చెప్పబడినది.
బుద్ధివికాసము, రాజ్యస్థాపనము మొదలైనవి ఇడయొక్క ప్రభావముచేతనే మనువు చేసెనని ఊహింపవచ్చును. తరువాత ఇడమీద కూడ అధికారము చేయవలెనను ప్రయత్నము వలన మనువు దేవగణ కోపభాజనుడు కావలసివచ్చెను.
“తద్వై దేవానాం ఆగ ఆస” (7-4 శతపథము) ఈ అపరాధమునకై ఆయన శిక్ష ననుభవింపవలసి వచ్చెను.
“తం రుద్రో - భ్యావత్య వివ్యాధ” (7-4 శతపథ) ‘ఇడ' దేవతల యొక్క “స్వసా" బయుండెను. మనుష్యులకు చేతన ప్రధాన మొనర్చునట్టిది. అందుచేతనే యజ్ఞములలో 'ఇడాకర్మ' జరుగుచున్నది. ఇడయొక్క ఈ బుద్ధివాదము శ్రద్ధా మనువుల మధ్య వ్యవధానమును కలిగించుటలో సహాయక మయ్యెను. మరి బుద్ధివాదపు వికాసమున అధిక సుఖాన్వేషణము లో దుఃఖము లభించుట సహజము. ఈ ఆఖ్యానము ఇతిహాసములో రూపకపు అద్భుత మిశ్రణము జరుగునంత ప్రాచీన మైనది. అందుచేతనే మనువు, శ్రద్ధ, ఇడ-ఇత్యాదులు తమ ఐతిహాసి కాస్తిత్వమును ఉంచుకొనుచు సాంకేతికార్ధమును గూడ అభివ్యక్త మొనర్చినచో నాకే మియు నభ్యంతరములేదు. మనువు అనగా మనస్సు యొక్క రెండు పక్షములు హృదయము, మస్తిష్కము యొక్క సంబంధము క్రమముగ శ్రద్ధా ఇడలతో గూడ తేలికగా కలుగుచున్నది.
"శ్రద్ధాం హృదయ్య యా కూత్యా శ్రద్ధయా విన్దతే వసు" (ఋగ్వేదము 10-5-4)
వీటన్నిటి యొక్క ఆధారముననే “కామాయని” యొక్క కథాసృష్టి జరిగినది. ఔను “కామాయని” కథాశృంఖలమును కల్పుటకై అక్కడక్కడ కొంచెము కల్పనను గూడ ఉపయోగించు నధికారమును నేను విడువజాలక పోయితిని.
- జయ శంకర ప్రసాద్
ఆంధ్ర కామాయని
475