Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/473

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఛాందోగ్యోపనిషత్తునందు మనువు శ్రద్దల భావములక వ్యాఖ్యానము కూడ లభిం చుచున్నది.

"యథావై శ్రద్ధధాతి అధామనుతే నా - శ్రద్ధధన్ మనుతే” (7-19-1)

ఇది నిరుక్తపు వ్యాఖ్యవలెనున్నది.

ఋగ్వేదమున శ్రద్ధ, మనువు - ఈ ఇరువురు పేర్లు ఋషులవివలె కన్పించును. శ్రద్ధకు సంబంధించిన సూక్తము నందు సాయణుడు శ్రద్ధయొక్క పరిచయము నిచ్చుచు వ్రాసియున్నాడు.

"కామ గోత్రజా శ్రద్ధా నా మర్షికా”

శ్రద్ధ కామగోత్రము యొక్క బాలిక. అందుచేతనే శ్రద్ధ అనే పేరుతోబాటు ఆమె “కామాయని” అని కూడ పిలువబడుచున్నది. మనువు ప్రథమ పథ ప్రదర్శకుడు. మరియు అగ్నిహోత్రమును ప్రజ్వలితము చేయునట్టి మరియు నితరములైన అనేక వైదిక కథలకు నాయకుడు.

“మనుర్హవా అగ్రే యజ్ఞేనేజే యదనుకృతేమాః ప్రజ్ఞాయజస్తే" (5-1 శతపథ)

వీరిని గురించి వైదిక సాహిత్యమునందు చాల సంగతులు వెదజల్లబడి నట్లు లభించు చున్నవి. కాని వాటి క్రమము స్పష్టముగాలేదు. జలప్లావన వర్ణన శతపథ బ్రాహ్మణము యొక్క ప్రథమ ఖండమున (8వ అధ్యాయమున) ప్రారంభమగును. దానిలో వారి నావ ఉత్తరగిరియైన హిమవత్ప్రదేశమునందు చేరిన ప్రసంగము కలదు. అక్కడ ఓఘ జలావతరణము జరిగిన మీదట మనువు ఏ స్థలము నందు దిగెనో దానిని “మనోరవ సర్పణము" అందురు. - “అపీపరం వైత్వా వృక్షేనావం ప్రతి బధ్నీష్వ, తంతు త్వా మా గిరౌ సన్తముదక మన శ్చైత్సీద్ యావద్ యావదుదకం సమవాయాత్ తావత్ తావదన్వవసర్పాసి ఇతి సహతావత్ తావదేవా న్వవససరం. తదప్యేత దుత్తరస్య గిరే ర్మనోరవ సర్పణమితి. (8-1)

శ్రద్ధతో మనువు కలిసిన మీదట ఆ నిర్జన ప్రదేశమునందే నశించిన సృష్టిని మరల ఆరంభించుటకు ప్రయత్నము జరిగెను. కాని ఆసురపురోహితుడు లభించుటవలన (కలియుట వలన) ఆయన (మనువు) పశుబలిచేసెను.


ఆంధ్ర కామాయని

473