'ఆముఖం'
మానవులకు తొలిపురుషుడైన మనువు చరిత్ర, ఆర్యసాహిత్యంలో వేదములు మొదలు పురాణములు, ఇతిహాసములలో వ్యాపించి ఉన్నది. శ్రద్ధామనువుల సంయోగంతో మానవత్వపు వికాసకథను రూపకావరణంలో భావించే ప్రయత్నము అన్ని వైదిక ఇతిహాసములతో పాటు నిరుక్తముద్వారా కూడ ఏవిధముగా చేయబడినదో, గడచిన కాలంలో ఆవిధంగానే ప్రయత్నము జరిగియుండినప్పటికిని, మన్వంతరము యొక్క మానవత్వపు నవయుగ ప్రవర్తకుని రూపములో మనువుకథ ఆర్యుల అనుశ్రుతిలో దృఢముగా అంగీకరింపబడి యున్నది. అందుచేత 'వైవస్వత మనువు'ను చారిత్రక పురుషునిగానే భావించుట సముచితము. తరచుగ జనులు గాథకు ఇతిహాసమునకు మిథ్యా సత్యముల వ్యవధానమును భావింతురు. కాని సత్యము మిథ్యకంటే ఎక్కువ విచిత్రముగా నుండును. ఆదిమ యుగపు మనుష్యుల ప్రతియొక్క సమూహమును జ్ఞానో న్మేషపు అరుణోదయములో సంగృహీత మొనర్చిన భావపూర్ణ ఇతివృత్తములు నేడు 'గాథలు' లేక 'పౌరాణిక ఉపా ఖ్యానములు' అని వేరుచేయబడుచున్నవి. ఏలనన ఆ చరిత్రలతోపాటు మధ్యమధ్యలో భావనల సంబంధము కూడుకొని ఉన్నట్లు కన్పించును. ఘటనలు కొన్ని చోట్ల అతిరంజితముగ గన్పించును. తథ్య సంగ్రహకారిణియైన తర్కబుద్ధికి అట్టి ఘటనలయందు రూపకమును (ఐరిళీ రిజిలి) ఆరోపించుటకు సౌకర్యము కలుగుచున్నది. కాని వానిలో కూడ కొంత సత్యాంశము ఘటనతో సంబంధమైయున్నది అని అంగీకరింపవలసి యుండును. నేటి మనుష్యుల వద్ద వాని యొక్క ప్రస్తుత సంస్కృతియొక్క క్రమబద్ధమైన చరిత్రమాత్రమే యుండును. కాని వాని చరిత్రయొక్క హద్దు ఎక్కడ నుండి ప్రారంభమగునో సరిగా దానికి ముందు సామూహిక చైతన్యము యొక్క దృఢమైన, గహనమైన రంగులరేఖలతో గడచిన, ఇంకను పూర్వపు విషయముల ఉల్లేఖనము స్మృతిపటమున అంకితమై యుండును. కాని అది కొంచెము అతిరంజితముగా నుండును. ఆ ఘటనలు నేడు విచిత్రతాపూర్ణములై కాన్పించును. బహుశః ఇందువలననే మనము మన ప్రాచీన శ్రుతులకు నిరుక్తముద్వారా అర్థము చెప్పుకొనవలసి వచ్చెను. దాని వలన ఆ అర్థములు మన ప్రస్తుతాభి రుచితో సామంజస్యము నొందును.
ఆంధ్ర కామాయని
471