ఆఁ. సూ సే భీగే ఆఁ. చల్ పర్
మన్కా సబ్ కుఛ్ రఖ్ నా హోగా
తుమ్ కో అప్నీ, స్మిత్ రేఖాసే
యహ్ సంధిపత్ర లిఖ నా హోగా,
ఈ పంక్తులకు అనువాదాన్ని చూడండి.
తే. 'సమర మత్యంత తీవ్రమై సాగు నమర
జన జయములకు, దను జాపజయములకును
అనయమును బ్రవర్తిల్లు మానసాంతరమున
గాఢ మౌచు వైరుధ్య సంఘర్షణమ్ము.
తే. అశ్రు కణసిక్తమైన వస్త్రాంచలమున
నుంచవలయు నెడందలో నున్నదెల్ల
మధుర దరహాస రేఖతో మగువ ! నీవె
ఈ సుసంధి పత్రమును లిఖింపవలయు
'కామాయనీ' చివరి సర్గ 'ఆనందం' లోని చివరి పంక్తులను పరిశీలించండి-
“సమరస్ థే జడ్ యా చేతన్
సుందర్ సాకార్ బనా థా
చేతనతా ఏక్ విలస్ తీ
ఆనంద్ అఖండ్ బనా థా'
ఈ పంక్తులకు అనువాదాన్ని గమనించండి-
తే. 'జడము చేతన మయ్యెడ సమరసములు
ఉండె సౌందర్య మచట రూపొందినట్లు
ఒక్క చైతన్య మొలసె మహోజ్వలముగ
నటనఖండ మహానంద మమరి యుండె'.
సమరసతావాదాన్ని, సత్ చిత్ ఆనంద స్వరూపంగా పరిలక్షించిన మహాద్రష్ట, మహాస్రష్ట అయిన జయశంకర ప్రసాద్ గుండెలోతు లెరిగి, సోమయాజులు గారు చేసిన ఈ అనువాదం కావ్యానువాద ప్రియులైన పాఠకులకు అమితానందం కలిగిస్తుందనడంలో ఎటువంటి సందేహము లేదు. 'కావ్యానువాదం అసంభవం' అనే
ఆంధ్ర కామాయని
469