కామాయని విశ్వమంగళ కామన-విమల మానస తట వీథి జ్యోతిష్మతి గతిగ సంఫుల్ల లతిక గతిగ నిలిచిన ఆమె, నిత్య సుందర, సతత సత్య భూరి చైతన్య శుభ మహాపుణ్య వపువు!
తే. భేద భావాళి సర్వమ్ము విస్మరించి
దృశ్యముగఁ జేసి సుఖ దుఃఖ హేల నెల్ల
"నేనె యిది" యను మీ వోయి మానవుండ!
విశ్వమే నీకు నీడ యై వెలయు నయ్య!!
అన్నది కామాయనీ కవితా హృదయ సందేశం! ఈ సందేశం వినినప్పుడు నేత్రాల్లో ప్రేమజ్యోతి ప్రతిఫలించకుండా ఎలా వుంటుంది ?
"దేవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా
మామేవయే ప్రపద్యన్తో మాయామేతాం తరన్తితే”
దురత్యయమైన ఈ మాయను తరించి ఆనందాన్ని పొందటానికే మనసుని అధ్యయనం చేయటం, ఎందుకంటే, “మన యేవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః" కదా!
“చంద్రమా మనసో జాత" చంద్రుని నుండి మనసు పుడుతూ వుంది. ఎలా? వైజ్ఞానికంగా చంద్రుడు ప్రజ్ఞానాత్మ. రేతః, యశః, శ్రద్ధా - అనే మూడు చంద్రునిలోని మనోజ్ఞతలు. అందుకే మనువు - శ్రద్ధల బంధంలో వైదిక రహస్యం ఉంది.
చాంద్రరసాన్ని 'శ్రద్ధ' అంటారు. ఇది దివ్యమైన ఆదిత్యాగ్నిలో హోమమై 'సోమం' గా మారుతుంది. ఈ సోమం, పర్జన్యాగ్నిలో హోమమై వర్ష రూపంలో పార్థివాగ్నిలో ఆహుతి కాగా ఓషధులు పుడుతున్నాయి. ఇవి ఆధ్యాత్మిక వైశ్వానరాగ్నిలో ఆహుతాలై రసాసృగాదిరూపాలు పొంది చివరికి “శుక్ర” రూపం పొందుతుంది. ఈ అన్న రూపశుక్రంలో చాంద్ర శ్రద్ధామయ సోమం, అంతరిక్ష వాయువు పార్థివ మృద్భాగం ఉంటాయి. విశకలన ప్రక్రియ చేత శుక్రంలో పార్థివ ధాతువు వెళ్లిపోగా, మిగిలిన వాటిని “ఓజస్సు” అంటారు. వాయు తత్త్వం పోగా మిగిలే సుసూక్ష్మ శ్రద్ధామయ సోమరసమే “మనస్సు”! "అన్నమయం హి సౌమ్య మనః" - విశ్లేషిస్తేనే గానీ మనుచరిత్రలు గానీ, కామాయని కావ్యాలు గానీ అర్థం కావు. తాత్త్వికాభి నివేశం లేని
464
వావిలాల సోమయాజులు సాహిత్యం-1