మూల పదార్థాల సముదా యమ్ము కాదు. అది అచ్చెరు వయ్యెడు నా మూలపదా ర్థాలదైన అన్యోన్యపు సమ్మేళనయునను ప్రకట మౌనేకత్వంపు బాహ్య రూపమ్ము. ఈ ఏక త్వపు రహస్యమును తెలుపుట కై ప్రతి విషయమ్మును విడ దీసి చూచు విశ్లేషణ దృక్పథాన్కి శక్తిలేదు. పదార్థాల తత్వమెంతొ అగోచరమ్ము ఎందువల్ల నంటే మనదౌ వాస్తవి క ప్రపంచ మీ పదార్థ మీ తత్వరూపమును గ్రహించ టాన్కి నిరాకరణ వహి స్తోంది గనుక ప్రాపంచిక మహాశక్తులైన కేంద్ర శక్తియు, నభిముఖశక్తియు, నా పరాఙ్ముఖపు శక్తియు మనదుగ్రహణ శక్తికి గల పరిధికెంతో ఆవలనే ఉన్నాయి. ఈ శక్తులు సృష్టికర్త దర్బారులో ప్రవేశింపనర్హతలే నట్టి రోజు కూలీలు మహాకవుల మతం కాని కాంతి, శబ్దమ్ములు వివిధ రమ్య వేషాలను స్వీకరించి, ఇంద్రియాల సమక్షాన నృత్యమ్మొన రిస్తున్నవి. సదా మనకు ఈ ప్రపంచక దృశ్యము సిద్ధమైన విందుగాని ఆ విందును సిద్ధపరచు నెట్టి పాకశాలి కాదు. ప్రాపంచిక బాహ్యరూప మేగానీ దాని అంత రంగిక తత్వమ్ము కాదు. ఋతువులదే నాట్యచంక్ర మణము, పట్టుచిక్కనిదౌ కాంతిచ్చాయా విచిత్ర లీల, పంచభూతమ్ముల వివిధ శక్తి ప్రదర్శనము చిత్రవర్ణ విలసితమౌ పక్షాలతో జీవవిహం గాల జనన మరణమ్ముల మధ్య సలుపు విహారాలు ఇవియే మన కంటికి కను పించునట్టి దృశ్యమ్ములు. వీనికి గల ప్రాముఖ్యం దేశకాల బద్ధమైన వానిదియగు అస్తిత్వం లోనగాక, వానివైన 401
పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/401
స్వరూపం