Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/399

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

"అట్టిదయిన ఆనందపు టనుభవమ్ము ఎన్నండును కలుగలేదు" అన్నాడు. “కాని అద్ది అతిశయోక్తి అనియే నా అభిప్రాయము. తనలోపలి ఏకత్వపు భావనకును, పరిసరాల కును పొంతన భగ్నమౌట వల్ల కలిగినట్టి బాధ చేత అలా అతడు ఊ హించి ఉండగా వచ్చును. కానీ ఈ విషయమ్మే ఆయేకత్వపు నస్తి త్వాన్ని ఎంతో అధికంగా చాటుతోంది. శరీరమ్ము వ్యాధిగ్రస్తమ్మయినపు డే ఆరోగ్యపుటర్ధము మానసాన్ని కడు బలముగ హత్తుకొనును. దేహంలో కడు ముఖ్య మ్మయిన విధులు సామరస్య మే ఆరోగ్యమ్ము గనుక ఆనందము నిస్తోంది. జీవన మందలి విషాద సంఘటనలు జీవిత సం తోషమ్మును తాత్కాలిక ముగను భగ్న మొనరజేసి మహాకవుల మతం శాశ్వతమౌ ఆనందపు సూత్రాస్తిత్వాన్ని నిరూ పించుటకే గాని వాని అస్తిత్వము ప్రకటనగా వించుకొనుట కేర్పడినవి కానెకావు. మనయందలి ఏకత్వపు పరమావధి తోటి జీవులందరి పరి పూర్ణ ప్రేమమూలంగా తనదు అనంతత్వమ్మును తెలుసుకొనుట ఈ ఏక త్వాన్కి గల్గు సర్వవిఘా తాలు దైన్యమును కల్గిం చుచు నీచప్రవృత్తులవి జృంభణాన్కి దారితీయు ఈ నీచ ప్రవృత్తులు బహు విభిన్నతా దృక్పథమ్ము వలన జనించిన మాయా రూపమ్ములు. మనయందలి ఏకత్వము వల్ల పుట్టు ఆనందము తన్ను తాను వెల్లడిగావించుకొనే యత్నంలో సృజనశీల మౌతున్నది. అయితే మన అవసరాలు తీర్చుకొనను మన అందున పుట్టెడు కో రిక మాత్రం నిర్మాణా 399