Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/398

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆశింపవు. వాటి మొరటు తనము కవ్వి సిగ్గుపడవు మనవౌ ఆవశ్యకతల మూలమైన కారణాలు ఆహారము, వస్త్రమ్ములు నీడ ఇతరమౌ సుఖసౌ ఖ్యములన్నీ కావలెనని నిత్యము నిర్బంధించును అయితే మానవులు తాము కేవల మీ నిత్యావస రముల పట్టికలను త్రోసి పుచ్చి వారియందున నొక పరిపూర్ణమ్మయిన యొక్క ఆదర్శం కలదనియును, తమ వివిధాంశముల మధ్య పరిసరములతో తమకొక సామరస్య మున్నదనియు ప్రకటించుటకును తమదౌ కాలములో బహుభాగము వ్యయమొనరిస్తున్నారు. అనంతత్వలక్షణమ్ము అంతులేని విస్తరణలో లేదు. అట్టి అద్వైతమ్మని చెప్పబడే ఏకత్వపు రహస్యమ్ము నందున్నది. సృజనీకృతమైన విషయ సందోహము అంతులేని 398 ప్రాంతమ్మును, కాలమ్మును ఆక్రమించు. అయితే ఈ విషయపు సందోహాన్నం తటిలోన నిముడ్చుకొన్న సత్యానికి మాత్రమెప్పు డెట్టి పరిమితియును లేదు. అద్ది ఏకైకమ్ము, అద్వి తీయము మరి ఏదైనా స్వల్ప విషయమ్మునగానీ, ఘనవిషయమ్మున గానీ ఈ అద్వైతంపు స్పర్శ మనకు సోకినప్పుడనం తత్వ స్పర్శ గుర్తింపగ బడుతున్నది. ఒక్కమారు ఒక్కరితో మన వ్యక్తి త్వమ్మువలన లభియించే ఆనందము గూర్చి నేను ప్రస్తావన చేసినాను. మనలో నేకత్వ భావ మొక్కటి నిక్షిప్తమై ఉంటవలననే మనమీ ఆనందము అనుభవింప గా గలుగుతు ఉన్నామని అన్నాను. అతడు తనకు వావిలాల సోమయాజులు