మహాకవుల మతం
1
సభ్యతన్న 'ప్రవర్తనా
సౌందర్యం' రమ్యమైన
వర్తనమ్ము పరిపూర్ణత
నొందటాన్కి సహనమ్మును,
ఆత్మనిగ్రహము, విశ్రాం
తిని నొసగే పరిసరాలు
వాతావరణమ్ము ఎంతో
అవసరమ్ము, సత్యమైన
మర్యాదయు, సంగీతము
చిత్రకళా ఖండమ్ముల
బోలు సృష్టి, కంఠస్వర
మందును, చలనములలోన
సంభాషణ పద్ధతిలో
చేష్టలు మొదలైన యట్టి
విషయమ్ముల సామరస్య
మందున నా ఔదార్యము
ప్రస్ఫుటమ్ము చేయబడుటె
మర్యాదనిపించుకొనును.
దానికి మనుజుని తత్వం
ఉన్మీలన గావించుట
గాని అన్యయౌ ప్రయోజ
నమ్మింకొక టెదీ లేదు
మనకీ భౌతికములైనవౌ
అవసరాలు మనలనెప్పుడు
త్వరపెడుతూ ఉంటాయి.
అవి ఎంతో పరుషాలై
ఎట్టి ప్రమాణాలను పా
టించకుండ పరస్పరమ్ము
త్రోసుకొంటు పరుగిడుతూ
ఉంటాయి. వాటికెట్టి
తీరుబాటుగాని, లక్ష్య
సాధనమ్ము వినా అన్య
విషయాలల్లో సహనం
గాని లేవు. మన దేశం
లోన నీరు తెచ్చుకోను
ఆ ఖాళీ కిరసినుడ
బ్బాలు మొరటు మొరటుగాను
కోయంబడి, కర్రలచే
అడ్డంగా బిగింపంబడి
కేవలమ్ము నీటితోటి
నింపబడుట అను ప్రయోజ
నమ్ముగాక అవ్వి అన్య
మైన యెట్టి ప్రయోజనము
మహాకవుల మతం
397