392 నొనరించుట, ఛేదనమ్ము రసాద్ర సోత్పత్తి వస్త్రమును విదిలించుట, భాషణమ్ము, దండము శస్త్రాస్త్రమ్ముల గ్రహియించుట అభిధావన, మారణమ్ము అశ్రువులను కల్గించుట రక్తపాన మొనరించుట మిక్కిలిగా తరుముటయును “ఓరి పాపి" మనుజ పశువ ద్రోహి నిలువు. ఎచట కేగె దోయి నీవు, మూర్ధమ్మును ఉత్పాటన గావిస్తా వక్షమ్మును చీలుస్తా దంతమ్ములు రాలుస్తా గాత్రమ్మును సంచూర్ణం గావిస్తా' ఇవి మొదలౌ వచనాలు భయం లేక వర్ణించుట, సాత్వికమ్ము లేక యుండు. అనుభావము లై ఉంటవి. అమర్షమ్ము మదము స్మృతియు ఔత్సు క్యావేగమ్ములు మోహము, గ ర్వమ్ము, ఈర్ష్య, చాపలమ్ము ఉగ్రత, ఈ సంచారీ భావమ్ములు దీన్కి గలవు 394 'శృంగార రసము' వలన 'హాస్య రసము' ఉద్భవించు, 'రౌద్ర రసము' వలన 'కరుణ రసము' కలుగు, 'వీర రసము' చే 'నద్భుత రసము' గలుగు 'బీభత్స రసమ్ము' వలన భయానక రసమ్ము కలుగు రసములు - వైరుధ్యము 'శృంగారము, బీభత్సము రెండు పరస్పర శత్రువు లౌ రసాలు. వీరభయా నక రసముల రెండింటికి వైరుధ్యం చేరి ఉంది. రౌద్ర రసము అద్భుతమ్ము వైర రసాలై యున్న హాస్యరసము, కరుణ రసము వైరుధ్యము గల రసములు రసము లన్ని కార్య వశ మ్మును చేరుతు ఉన్నవేళ వానిలోన ఏ రసమ్ము మొదట చెప్పబడుతుందో అది ప్రధాన రసమౌను.. వావిలాల సోమయాజులు సాహిత్యం-1
పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/392
స్వరూపం