'కలి విడంబన సవ్యాఖ్యానుసరణం '
సత్కవి శ్రీ ఊట్ల కొండయ్య
విద్వత్కవులైన శ్రీ వావిలాల సోమయాజులుగారు, 60 ఏండ్లుగా చేస్తున్న పని -అధ్యయనమూ, అధ్యాపనమూ, రచనమున్నూ. అధ్యాపన కార్యక్రమం మాత్రం రిటైర్మెంటుతో ఆగిపోయినా, మిగిలిన రెండు కార్యక్రమాలున్నూ అవిచ్ఛిన్నంగా కొనసాగుతూనే వున్నాయి నేటి వరకు. యాభై రెండేండ్లుగా నే నెరుగుదును వీరు నిరంతరాయంగా రచనలు చేస్తూవుండడం. కవిత్వమూ, చరిత్ర - సాహిత్య పరిశోధన వ్యాసాల రచనంతోపాటు విద్యార్థులను విద్యాధికుల్ని చేసే అనేక గ్రంథాలు నిర్మించడమే గాక, మరొక గొప్ప పని కూడా చేశారు సోమయాజులుగారు.
విద్యార్థుల కోసం అనేక విధాలుగా గ్రంథరచనం చేశారు చాలా మంది పండితులు అలాగే చరిత్ర - సాహిత్య పరిశోధన రచనలున్నూ అలాగే ఎవరికి వారు కవిత్వమూ వ్రాస్తున్నా రనేకులు. అయితే, ఈ అన్నిరకాల రచనలూ కలుపుకొని చేసినవారు తక్కువ. వీటితో పాటు అనువాదాల్ని కూడా తమ రచనా కార్యక్రమంలో ఇముడ్చుకొన్నవారు చాలా తక్కువ. అల్ప సంఖ్యాకులుగా వున్న వీళ్లల్లో అందరూ, అందరికీ తెలిసి బాగా ప్రచారంలో వున్న గ్రంథాలనే అనువదిస్తూవుండడం పరిపాటిగా వుంది. వీళ్లలాగే వావిలాలవారున్నూ అనువాదాలు చేశారు, విద్యార్థుల కోసమని, ఇంగ్లీషు నుండి షేక్స్పియరు నాటకాల్ని కొన్ని ఇంగ్లీషు - లెక్చెరర్లు కొందరు వీరి అనువాదాలు చదువుకొని, షేక్స్పియర్ ఆంగ్లనాటకాల పాఠాలు చెప్పేవారంటే, ఆ అనువాదాల ప్రాశస్త్య మెలాంటిదో మనం ఊహించుకోవచ్చు. విద్యార్థుల కోసం చేపట్టిన అనువాదాల సంగతి మాత్రమే ఇది. వావిలాల వారి అనువాద కార్యక్రమంలోని ప్రధాన సూత్రం మరొకటి.
సాహిత్యలోకంలో అట్టే ప్రచారంలోకి రాకుండా మరుగునపడి వున్న అన్యభాషా గ్రంథాలను - మహోన్నతమైన వాటిని -మన పాఠకులకు పరిచయంచేయడం, మన కవులకూ పండితులకూ రచయితలకూ, జ్ఞాపకం చేసి, చూపించడమూ శ్రీ వావిలాల వారి ప్రధానోద్దేశ్యమని, సంస్కృతం నుండి జయదేవుని 'పీయూషలహరి’ అనువాదమూ, దానిపై వారి పరిశోధన వ్యాసమూ ఆంగ్లం నుండి క్రైస్తవ, మొహ్మదీయ
298
వావిలాల సోమయాజులు సాహిత్యం-1