Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూలంలో 'హాస' అని రెండక్షరాల్లో చెప్పిన భావాన్ని "పయరగ హాస్య మాడుము” అని నవాక్షరగుంభితంగా, నవార్ధ బంధురంగా చెప్పుటం విశేషం. 'పయర' శబ్దానికి దక్షిణపు గాలి అనే అర్థం ఉంది. మలయమారుతం వీచినట్లు మంచి హాసోక్తులు పలికితే ప్రతివాదితో పాటు ప్రభువుకూడా ముగ్గుడు కాక తప్పదు. మూలానికి మెరుగులు దిద్దిన అనువాదం వావిలాల వారిది.

మూలం అనుష్టుప్పులో, ప్రతిపాదం అష్టాక్షరిగా నడుస్తుంది. అనువాదం చంపకోత్పల శార్దూల మత్తేభాలుగా ఏకోత్తర - ఏకోన వింశతి - అక్షర బద్ధ పాదాలుగా ప్రసరిస్తూ, పరిమళ లహరులు కుమ్మరిస్తూ, ఉదాత్తగమన సౌందర్యాన్ని ప్రత్యక్షం చేస్తాయి.

దాంభికులైన మాంత్రికులకు ప్రౌఢ గంభీర మౌనమే మహామంత్రమట! (13) జ్యౌతిషికుడు "పుట్టబోయే బిడ్డ - ఆడా? మగా?" అనే విషయంలో తండ్రికి కొడుకనీ, తల్లికి కూతురనీ చెపుతాడట! ఆడ పుట్టినా మగపుట్టినా పురస్కారం పుచ్చుకోవటానికి అప్పు డిబ్బంది ఉండదట. కలి కాలపు జ్యోతిషికుల కెంత తెలివి?

ఇంటి ప్రక్కన దుష్టుడు తారసిల్లితే ఆ యింట్లో కాపురం ఎంత కష్టమో నీలకంఠుడు పరిమిత పదాల్లో రూపక మర్యాదలో ప్రవచించాడు.

     "కాలాంతరే హ్యనర్థాయ గృధ్రో గేహోపరిస్థితః
      ఖలో గృహసమీపస్థః సద్యో నర్దాయ కేవలమ్ ”. (74)

సోమయాజులవారు ఆ చాలునకు రెక్కలు విప్పి - లీలగా ఆడించిన తీరు తిలకించండి.

ఉ. "రెక్కలు విప్పి యాగుచును, లీలగ నారుకు వ్రాలి కొప్పుపై
     కెక్కిన గృధ్రమౌ నెపుడో యేదో యనర్థ నిమిత్త ౽ మింటికిన్
     ప్రక్కగ నున్న దుష్టుఁడు కృపారహితాత్ముఁ డనర్ధ హేతువౌ
     ఇ క్కలికాల మందు కన నెప్పటి కప్పుడే క్రూరకృత్యుడై" ( 74)

శబ్దార్థ శక్తి గల సత్కవికి అసాధ్యమనేది లేదు. మంచి మాటతో జనవశీకరణం హాయిగా చెయ్యగలడు. 'ఏకాక్షి' ని శతపత్రేక్షణుని చెయ్యగలడు 'లోభిని కల్పవృక్షంగా’ మార్చగలడు. 'పిరికి వాణ్ణి వీరవరేణ్యుని'గా వర్ణించగలడు. సరస్వతీశ్వరు డైతేచాలు; వానికి చేతకాని దేముంటుంది? ధ్వనిచే వ్యంగ్య వైభవాదులు వాని కవితలో 296వావిలాల సోమయాజులు సాహిత్యం-1


296

వావిలాల సోమయాజులు సాహిత్యం-1