తే. అవును కర్తవ్యమునకు సిద్ధాంత మెంతొ
యవసరమ్మైన మూలమ్ము - అద్ది దోష
యుతమయిన యెడ లోపభూయుతమె యౌను
శ్రద్ధతోఁ జేయునట్టి యాచారమైన.
తే. ఉత్తమ ప్రకృతి విలువతో నొప్పు నెప్పుడు
స్వర్గమును మించి, కనకమ్ము వాస్తవముగ
సంపద యొసంగు బహుమతి, సర్వవేళ
లందు ప్రకృతి స్వభావ శుల్కమ్మెయగుట.- ఎడిసన్
తే. కొన్నివేళల దూరమ్ము, గోలు పుచ్చి
దోషముల మైత్రిఁ బ్రేమగాఁ దోపఁజేయు
మిత్రుఁడే కూడియున్న సమేళనమున
మైత్రియొనరింపఁగాఁబడు మధురతమము.
తే. దేవు నెదుటను, భావన న్దేవుకొరకు
నృత్య మాడుట పూర్వమ్ము నీతియయ్యె
నేఁడు నయ్యది, తరచుగ పాడుచుంట
నయ్యెదయ్య మొదటను, దయ్యమ్ము కొఱకు.
తే. దాంభికుఁడు ఘనతర వస్త్రధారి, అతఁడి
వైన వ్యాపార కార్యాలయములు, ఉనికి
దుస్తులను ధరియించుటతో నెసంగు -
బ్రతుకు నాతఁడు వస్త్ర ధారణము కొఱకు.
తే. ఉండఁ దుది వ్యాధి నుత్తము నొకని నడుగ
"ఆర్య! మరణించుచున్నావె” యని యతఁడనె
“నేను మరణింప దేవుని తోడనుందు
బ్రతుక దేవుఁడు నాతోడఁ బరగుచుండు.” - ప్లూటార్క్
తే. మృత్యువును మిత్రుపోల్కి భావించి మదిని
తెలుసుకొని యెట్లా యతని కాతిథ్య మిడుట!
శత్రువై రాగననుకొన్న సమర మిమ్ము!
వింతగా వచ్చినప్పుడే వెట్టిపరచు.
284
వావిలాల సోమయాజులు సాహిత్యం-1