తే. బాగు గావించుకొనఁ జేయు పనుల నీవు
శత్రువులఁ బిల్చి చూపుట చాలు మిత్రు
లరుగుదెంచియు, దోషాల నరయలేరు
- మెచ్చుకొనెదరు ప్రేమ సమీకరించి.
తే. కావ్యకర్తకు శత్రువే గాక, పూని
నతఁడు వ్యతిరేకియును గాని యాతఁడెంతో
కర్తృ దృష్టినిఁ బరికింపఁ గడఁగుఁ గాన
అతని దౌగద ఉత్తమమౌ విమర్శ!
తే. మనసు గొనుట విమర్శపై మనకు రమ్య
వస్తుదర్శన తొలగింప వచ్చు కాన
నెట్టి యాసక్తి లోనైన నిరుకు పడక
కావ్యరమ్యత దర్శింపఁ గడఁగు తొలుత.
తే. సత్యవిశ్వాసముల మధ్య సాగు నొక్క
పూజ్య సంబంధ మదెపుడు పొలయు చుండు,
సత్య మా భౌతికముల విశ్వాసమగుచు,
అగును సత్య విశ్వాసము లమరములను.
తే. మానవుల లోపములలోన మలుచుచున్న
యద్ది యాచారమౌను రాజాధిరాజు
చట్టములు చేయుటేగాని సాగవవ్వి
సర్వభూమి నాచారముల్ సాగుచుండు.
తే. మోస మీయదు సద్గుణమ్మునకు విలువ
అది వివేకమ్మునకు నల్పమౌ ననుకృతి
పూని మోసకారి సగము వానినైన
మీరఁగల్గుట నిశ్చయమే కనంగ.
తే. చాల మోసమ్ము లనుచును జగము తలఁచు
కాని విశ్వాస కోశానఁ గానఁ బడదు
మోసమను శబ్ద మితరుల మోసమెపుడు
తోచు విశ్వాసులకు దేవసూచనముగ. -జాన్ న్యూటన్
మధుప్రప
279