తే. ఇల నహంకార పాపాల వలచు నటులఁ
జేయు మోపకల నిర్జింపఁ జేయు కొఱకు
నప్పులను దీర్చుటగును దైవానుగ్రహము
పిదప నుత్తమ సాధన - ఇది నిజమ్ము.
తే. అన్యమతముల దౌర్జన్య మణపవలయుఁ
గాని యవ్వాని భంజింపఁ గడఁగ రాదు
అన్ని మతముల నుత్తములున్నవారు,
నాస్తికులు కారకులు సర్వనష్టములకు.
తే. 'అప్పులేనివానికి లేదు ఆపదయును'
వినుము ఇయ్యది ఎంతో వివేకయుతము
అద్దియున్న దుష్టత్వదైన్యమ్ము లబ్బు
హృదయమున, నాకు విశ్రాంతి ఎరుక పడదు.
తే. ఎట్టిదో పాము పక్షికి నటులె ఋణము
మానవుల కగు - నేత్రమ్ము మభ్యపెట్టు,
ఊర్పు గరళమ్ము వోయును, ఓడిసి చుట్టు
కొనియు స్నాయువుశల్యాల మట్టు మణచు.
తే. మోసకారులు సంఘాన ముఖ్యులౌ ప్ర
మాదకరులౌదురనురాగ మహితగతుల
పైనఁ బరిహాస మొనరింత్రు వారు సర్వ
రమ్య సౌజన్యములను దిరస్కరింత్రు.
తే. గాఢ సద్భక్తిఁ బోలి భూగర్భమందు
ప్రసరణము సేయు నిమ్నగన్ భద్రగతుల
లోకనేత్రాల మూయుఁ బ్రత్యేకముగను
త్రిప్పుటకుఁ దను జూడఁగా దేవుకనులు.
తే. ప్రార్థనము కాక పోయిన స్వర్గమునకు
ద్వారమగు కుంచిక చన యత్నమ్మొనర్చి
దొరుక కున్నను స్థానమ్ము తొలుత, పిదప
తలప సర్వమ్ము ప్రార్థనా స్థానమగును.
278
వావిలాల సోమయాజులు సాహిత్యం-1