తే. అరయ వైరూప్యమౌను సాహసయుతమ్ము
దాని సారమౌ హృదయాత్మల హరించి
లోఁ బరచుకొని మానవలోకమెల్ల
నొలసి తనుఁ జేకొనుట నిఖిలోత్తమముగ.
తే. సర్వతంత్ర స్వతంత్రులు, గర్వరహితు
లెల్లవేళలఁ గావలె నెంత గానో!
దళిత బలహీన కష్ట సంతప్త జనులు
నఖిలమౌ జీవిత వ్యవహారములను.
తే. సిద్ధపడినట్టి వానికి స్టైల్ల దెపుడు
వలచ నాలస్య మద్ది యాపత్కరమ్ము
దీపముల వ్యర్థమొనరించు తెరవు అద్ది
దేవసేవ యందైన వర్తింపరాదు.
తే. దారుణాసక్తి తుదటను క్రూరములగు
తానె యాలింగనము సేయుతరుణమందె
తరిగిపోవు శక్త్యగ్నిగాఁ దలఁపనద్ది
మహితజయ సమయాననే మరణమొందు.
తే. లొంగి నట్టులె విధికిఁ దా లొంగు మనుజుఁ
డిలను నాచారఫణితికి వలచి, వలచి
మనసు నడకల, శారీంమార్గములను
ఆస్తి పాస్తుల పాలనార్హతలలోన.
తే. కలిగియుంట బాలలయెడఁ గౌతుకమ్ము
అరయ జ్ఞానేచ్ఛ యందు ఘనాభిలాష
తమకుతూహల మెవ్వరుఁ దలపకుంట
చెలఁగి బాలలు తమ్ము త్యజించు కొండ్రు.- లోకే
తే. కష్టపెట్టెడి స్వప్నదుర్గాథనుండి
జాగృతినిఁ బొంద సుఖియించు సరణితోచు
మరణమొందిన సమయాన మనసునందు
నటులె కన్పట్టు స్వర్గ సౌఖ్యమ్మె వచ్చి.
మధుప్రప
277