Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. స్వప్నకరణమ్ము కేవల భావనమ్ము
    ఇద్ది రూపించు నెల్లర సృజనలీల
    మేలుకొనియున్న వేళ నీ లీలయున్న
    యెడల వాల్మీకు లయ్యెద రెల్లవారు.

తే. బ్రతుకు నార్జించు కొనువేళఁ బడసినట్టి
    దరయ లోకాన నుత్తమమైన విద్య
    ఆత్మత్యాగమ్ము నేర్పెడి దధమ విద్య -
    ఇతరమును నేర్పు విద్యకు నెంతో ఘనము.మూస:Right float

తే. ఈవు విశ్వ సమ్మతిని నర్థింతు - దాని
    కేను విశ్వవిద్యయును వాంఛింతుఁ దోడు
    శుభ్రగతిని మనుజ మనసునకు విద్య
    యగును ప్రారంభమెపుడు నుయ్యాలయందె.మూస:Right float

తే. మనసు విద్య నెఱుఁగ వర్తమాన జనులు
    భావితరముల వారికిఁ బడిన యప్పు
    అతి వివేకియు విద్య నిరంతరమ్ము
    దీన కర్షకు కడ కొంత తెలియవచ్చు.మూస:Right float

తే. విద్య లక్ష్యమ్ము మనసును విమల జీవ
   నోల్బణమ్ము గావించుటే ఉత్తవాపి
   నొనరఁ జేయుటగాడు మహోన్నతముగ
   నింపుకొని నిండ బయటకు బంపుకొరకు.మూస:Right float

తే. ఓడుటా? విద్య యద్ది మరొక్కటగునె!
    ఘనత నొందఁగ నది తొలి ఘట్ట మరియ
    అద్దియౌ నొక్క మాన్య విద్యాలయమ్ము
    అందు సత్యమ్ము పొందెడు నధిక బలము.

తే. ఒక అసంతృప్తి విడువక నుత్కటముగ
   పట్టి సాధించుచున్నట్లు గట్టివడిన
   నమ్మకము చేతఁగాక నన్యమ్మువలన
   నోటమినిఁ బొందు చుండునే యొక్క నరుఁడు?


276

వావిలాల సోమయాజులు సాహిత్యం-1