తే. స్త్రైణ దారిద్య్రమును జూపు సమయమందు
కపట వేశన కెపుడవ కాశముండ
దెచట కామచారమున నే తెరవయైనఁ
దక్కువగఁ బొందునా వస్త్ర ధారణమ్ము? ఛార్లెస్ లాంబ్
తే. వస్త్రధారణ మనుజ ప్రవర్తనమునఁ
గల్గియున్నది యొక నైతిక ప్రభావ
మద్ది తగుగతి లేకున్న నబ్బి తీరు
సభల గౌరవలోప విసర్జనములు.
తే. గాఢముగ బాహ్యలక్షణాల్, గౌరవమును
గలుగఁ జేయు నాగరక సంఘమ్మునందు
వీపునను మంచి కోటున్న బిలుచుచుంద్రు
తెల్వి తేటల నేమియుఁ దెలిసికొనరు.
తే. దుస్తులను నెన్ను కొనియెడు త్రోవలందు
వర్ణముల యందమునకు లోఁబడుట చేత
నట్టి వానిని గ్రహియింతు రరయఁ బోరు
జనులు తమకంద మిచ్చు వస్త్రములఁ దరుచు.- షన్ స్టోన్
తే. దివ్యమోహన రమణీయ దీపకాంతి
లభ్యమౌనటు లంధకారమ్ము నుండి,
భయదగాఢ విసంవాద చయము నుండి,
యెదవు గంభీర విశ్వాస ముజ్జ్వలించి.- ఆర్.టరన్ బుల్
తే. నమ్మి, సత్యమ్ము నన్వేషణ మ్మొనర్ప
నొలయు ననుమాన మెవ్వేళ నుత్సుకముగ
సలుప నమ్మహా శాంతవి చార ణమ్ము
కడగి యయ్యది సత్యమార్గమున నడుపు.
తే. ఒడుపులో మ్రోయు నీలోక యుగ్మభారు
లైన విశ్వాస జనవృత్తి నధిగమించి
సత్యసంధుని యనుమాన చయము తెలుపు
నధిక నైతిక సత్యాల నముతమిగను.
మధుప్రప
275