తే. ఎవఁడు తనుఁ గూర్చి మాటాడు నెంతగానో,
ఎవఁడు నన్ను గురించి భాషించుకొనఁగ
నించుకైనను కాలమ్ము నీయ బోడొ
వాఁడు తెలియంగ నెంతయు స్వార్థపరుఁడు.హెచ్.యల్.లైలాండ్
తే. ఎపుడు మనగూర్చి మనము భాషింతు మపుడు,
ఎంతో మోసగాండ్రవలెఁ గాన్పింతుమోయి!
మనదు నెదలెంతగానొ గర్వించునపుడు
పోలుచు వినయాన మన శబ్దములు ధ్వనించు.హఠె
తే. ఎందువలనన - మానవ హృదయమందు
సత్యమునకు, నందమునకు స్వాదు ప్రేమ
మునకు పరివర్తనమ్మును బొందనట్టి
వర్తన మ్మనూహ్యమ్మునై వరలు గాన.- హెచ్.ఎల్. లాక్ ఎల్లిస్
తే. బాగుగా నెద్ది నేర్పంగ, బడుచునున్న
నేను విషయ మే దంచు పట్టించుకొనను
ఆధునిక విద్య వ్రేళ్లకు నంగుళీయ
కములు నిల్పును పిడికిలి కడను కోయు.థామస్ హెచ్. హక్స్ లీ
తే. ద్వివిధమ్ము విద్యారీతి - తెలియుట తొలి,
అవల నుచ్చరించుటయును, అంతేకాదు
ఆంతరిక జీవి యోజించు నధికముగను
దాత్తముగను, మాటాడడు తరుచుగాను.ఆర్.ఎల్. స్టీవెన్ సన్
తే. అధికముగ నేఁడు వివిధ విద్యాలయములు
ప్రజకు విద్యను నేర్పఁగా, బాటుపడుట,
ప్రీతి శాస్త్రీయ యోజనా పీఠములుగ
నుంట తప్ప నందునను కొన్నింట తప్ప.- వాల్టర్ జె. పిట్కిన్
తే. హృదయ గాఢ రహస్యాల నెఱిఁగి నట్టి
సదధికారమ్ము నొందిన స్థాయిలోన
నే నసాధారణత యన్న హీనగుప్త
క్రిమి నటించు పాత్ర తమి నెఱింగినాఁడ.
మధుప్రప
273