Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. మామ మరణింప నల్లుఁడు మామసతిని
    అత్తను గ్రహింపవలెఁ బెండ్లాడి సతిగ
    అందు కంగీకరింపక నల్లుడున్న
    పంపఁబడును 'గారో మాతృస్వామి కమున'
    (Customanny law and justice in the tribal of Meghalaya -published by N.M. Tripathi (p) ltd Bombay)

తే. సరగున పొగడ పన్నీరు వంటి దగుచు,
    వాసనను జూచి విడువఁగా వలయు దాని
    నిరతమద్దాని సేవలో నిలువరాదు
    కాని, నిల్చిన నాపద కలిగి తీరు -జాన్ బిల్డింగ్స్

తే. పెద్ద గుంపులుగా సమావిష్ణు లౌటఁ
    బ్రజలు ప్రజ్ఞులఁ బెంచుకోవచ్చు - కాని
    సద్గుణమ్ములు కొన్ని నష్టమ్ము నొందు
    మతులు బలమొందు, నీతుల గతులు మారు.

తే. పక్షులకుఁ బంజరములయి శిక్షవేయ
    జంతువుల నుంచు నట్టి కొష్టములు పగిది
    నతుల విఖ్యాతులగువారి యాత్మలకును
    కడు మహానగరమ్ములు కారలగును.

తే. నాదు చిననాఁటి మిత్రుండు నన్నుఁ బిలువ
    నతఁడు వసియించు నగరాని కరిగి నేను
    “అంత ధనమెట్లు గడియించి" తనుచు నడగ
    "ఆదరమ్మున" నంచునా కతఁడు తెలిపె.

తే. దేవుఁడొనరించె మానవదేహ రూప
    మద్భుతగతి, సత్యున్నతమైన రీతి
    జీవితమ్మెల్లఁ దెలియఁగఁ జెల్లు సృష్టి
    యద్ది తెలియఁగా సంక్షేమ మఖిలమబ్బు.

తే. అతఁడు కీడుకుఁ దగినవాఁడనుచు నమ్మి
    కోరి యతనిని వారు పల్కుదురు గాన


మధుప్రప

265